యాంకర్ శ్యామలకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లి తెర మీద పలు షోలకు యాంకర్‌గా చేస్తూ.. క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొన్నది. దీని తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వ్యాఖ్యతగా చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది శ్యామల. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్‌లో ఏం చెప్పారు శ్యామల అనే ఛానెల్లో తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తుంది శ్యామల. ఈ క్రమంలో తాజాగా శ్యామల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
యాంకర్ శ్యామలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికి తెలుసు. తోటి నటుడు నర్సింహ్మరెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక పెళ్లి విషయంలో సామాన్యులకే ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి. ఇక సెలబ్రెటీల సంగతి అయితే చెప్పక్కర్లేదు. అంగరంగ వైభవంగా.. ఎంతో ఘనంగా వివాహం జరుపుకుంటారు. ఒకవేళ.. పెళ్లి సయమంలో ఏవైనా కోరికలు తీరకుండా ఉంటే.. ఆ తర్వాత వాటిని తీర్చుకుంటారు. యాంకర్ శ్యామల కూడా ఇదే పని చేసింది. పెళ్లి వేళ తీరని ఓ కోరికని తాజాగా తీర్చుకుంది.
వివాహ సమయంలో.. పెళ్లి కుమార్తెగా అందంగా ముస్తాబయ్యి.. పల్లకిలో ఊరేగాలని శ్యామల కోరిక అంట. అయితే తమ పెళ్లి సమయంలో ఆ కోరిక తీరలేదు. ఈ క్రమంలో తాజాగా ఆ కోరిక తీర్చుకున్నారు శ్యామల. హంసవాహనం ఆకృతిలో ఉన్న పల్లకిలో కూర్చేని ఊరేగింపుగా వచ్చింది. నలుగురు మనుషులు పల్లకి మోసుకుంటూ రాగా.. దాని ముందు కొందరు డ్యాన్స్ కూడా చేశారు. ఇక బారికేడ్లు కట్టి.. జనాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడమే కాక.. పోలీసులు కూడా హాజరయ్యారు. హంసతూలికా తల్పంలాటి పల్లకిలో.. రాకుమారిలా అందంగా ముస్తాబయ్యి.. ఊరేగింది శ్యామల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.