Anchor Syamala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన శ్యామల.. నటిగా కూడా పలు సినిమాలలో మెరిసింది. అయితే.. నటిగా కంటే గ్లామరస్ యాంకర్ గానే సక్సెస్ అయ్యింది శ్యామల. ప్రస్తుతం సినిమా ఫంక్షన్స్ తో పాటు అడపాదడపా టీవీ షోలలో సందడి చేస్తుంటుంది. సినిమాలు, సిరియళ్లలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ శ్యామల యాక్టివ్‌గా ఉంటుంది.
తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానల్ ‘ఏం చెప్పారు శ్యామల గారు’లో తన ప్రతిభను బయటపెట్టేలా వీడియోలు చేస్తుంటుంది. తాజాగా, తన డ్రీమ్ హోం గురించి ఆమె ఓ హోం టూర్ వీడియో చేశారు. నాలుగు ఫ్లోర్లలో ఉన్న ఆ ఇళ్లు అద్భుతంగా ఉంది. పల్లెటూరినుంచి వచ్చిన వారు కావటంతో శ్యామల, ఆమె భర్త ఎంతో ఇష్టంగా.. పల్లెటూరి వాతావరణం ఉండేలా ఆ ఇంటిని డిజైన్ చేయించుకుని కట్టుకున్నారు.
తెలుపు, బూడిద రంగులో ఇంటిని తీర్చుదిద్దుకున్నారు. బెడ్ రూం, పర్శనల్ బెడ్‌రూమ్‌లతో పాటు తమ కుమారుడికి కూడా ప్రత్యేకంగా ఓ రూము ఏర్పాటు చేశారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటూ రెండు హాళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో ఓ లిఫ్ట్‌కూడా ఉంది. ఇక ఇంటిపైన పార్టీలు చేసుకోవటానికి ఓ ప్లేసును ఏర్పాటు చేసుకున్నారు. మరి, యాంకర్ శ్యామల హోంటూర్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: RGV: జోకులు వేయొద్దంటూ.. యాంకర్ శ్యామలపై RGV సీరియస్..!