యాంకర్ శ్యామల.. బిగ్బాస్కు ముందు ఆమె గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఫాలోయింగ్ కూడా అంతగా లేదు. కానీ బిగ్బాస్ షోలో కనిపించిన తర్వాత శ్యామల్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది శ్యామల. యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది. ఇక ఇన్స్టాగ్రామలో కూడా శ్యామలకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా శ్యామల తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. దీనిలో భాగంగా ఓ నెటిజన్ నుంచి శ్యామలకు ఊహించని ప్రశ్న ఎదురయ్యింది.. దానికి ఆమె కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
తాజాగా శ్యామల తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. నెటిజనులు శ్యామలను రకరకాల ప్రశ్నలు అడిగారు. కొందరు పర్సనల్ విషయాలను టచ్ చేశారు. బెస్ట్ ఫ్యామిలీ పిక్ ఏంటి.. తన కొడుకు ఇషాన్ గురించి ఇలా ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మరో అడుగు ముందుకు వేసి.. ఓ కొంటె ప్రశ్నను సంధించాడు.
ఇషాన్ ఆడుకోవడానికి ఓ చెల్లిని ఇవ్వొచ్చు కదా? అని అడిగేశాడు. దానికి శ్యామల అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఓరీ దేవుడా? అన్నట్టుగా నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. మొత్తానికి యాంకర్ శ్యామల మాత్రం నెటిజన్లకు ఇచ్చిన సమాధానాలు బాగానే వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.