సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు త్వరగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వార్తలు వారిని బాధించేలా ఉంటాయి. కొందరు పనిగట్టుకుని సెలబ్రిటీలపై వివాదస్పద కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ అలాంటి ట్వీట్ ఒకటి చేశారు.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలానే తమ అభిమాన హీరో, హీరోయిన్ల సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాల కోసం ఎదురు చూస్తుంటారు. అంతేకాక సినీ ఇండస్ట్రీలో వచ్చే గాసిప్స్ పై కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. అలానే కొందరు సెలబ్రిటీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. నటీనటుల వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు కమల్ ఆర్ ఖాన్. ఆయనను అందరూ ముద్దుగా కేఆర్కే అని పిస్తుంటారు. బాలీవుడ్ నటుడిగా, క్రిటిక్ గా ఉన్న కమల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ తరచూ వార్తలో నిలుస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలు, బి-టౌన్ స్టార్ల వ్యక్తిగత విషయాలు, సంబంధాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేసి అనేక సార్లు సమస్యల్లో చిక్కుకున్నాడు. అంతేకాక అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అంత జరిగిన కమల్ తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ఆలియాభట్, దీపిక పదుకోణే, అమిర్ ఖాన్ వంటి స్టార్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అతడు తాజాగా మరో బాలీవుడ్ జంటను టార్గెట్ చేశాడు.
ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంటను ఉద్దేశిస్తూ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. “ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ కొత్త సంప్రదాయం నడుస్తోంది. అదే ఏమిటంటే.. మొదట ప్రెగ్నెంట్ అయ్యాక.. ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అయింది” అంటూ ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరు అనేది మాత్రం రివిల్ చేయలేదు. దీంతో కేఆర్ కే ట్వీట్ పై నెటిజన్లు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. ఇటీవలే వివాహం చేసుకుంది కియారా అద్వానీ, సిద్దార్థ కదా?. అంటే కేఆర్ కే చేసిన ట్వీట్ వారిని ఉద్దేశించేనా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పెళ్లి ముందే ప్రెగ్నెంట్ అయినా బాలీవుడ్ జంటలు కొన్ని ఉన్నాయి. గతంలో ఆలియా భట్ ఇలానే పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తో పెళ్లై అతి తక్కువ సమయంలో ప్రెగ్నెంట్ అయ్యి అందరిని ఆశ్చర్య పరిచింది. తాజాగా ఆమె బాటలోనే కియారా అద్వానీ కూడా వెళ్లిందా?, ఈ భామ కూడా ప్రెగ్నెంట్ కావడంతోనే ఆ ప్రేమ జంట అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కమల్ ట్వీట్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇలా పక్కవారిపై అసత్య ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకో అంటూ అతడిపై మండిపడుతున్నారు. మీ పని మీరు చూసుకోండంటూ ఆయనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
చాలా కాలం నుంచి ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. ఈ ప్రేమ పావురాలు చాలాకాలం సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నారని సమాచారం. అలాంటి ఈ జంట ఇటీవల ఫిబ్రవరి 7న వివాహ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల, బంధువుల సమక్షంలో వీరి విహహం జరిగింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లోని సూర్యగడ్ ప్యాలెస్ లో వీరి పెళ్లివేడుక ఘనంగా నిర్వహించారు. ఇలాంటి తరుణంలో కేఆర్కే ట్వీట్ అందరిలో ఆలోచనరేకెత్తించింది. అయితే కేఆర్ కే చేసిన ట్వీట్ ఈ కొత్త జంటను ఉద్దేశించేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai.
— KRK (@kamaalrkhan) February 12, 2023