టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మీద పిల్ దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు టీమిండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గేమింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ.. ఈ ముగ్గురూ యువత జీవితాలను నాశనం చేస్తున్నారంటూ బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో పిల్ దాఖలైంది. ముజఫర్‌పూర్‌కు చెందిన తమన్నా హష్మీ అనే సోషల్ యాక్టివిస్ట్ ఈ పిల్ వేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు రిలేటెడ్‌గా ఉన్న ఆన్లైన్ గేమ్స్‌కు ప్రచారకర్తలుగా ఉంటూ.. వాటిలో పాలుపంచుకునే విధంగా యువతను ఉసిగొల్పుతున్నారని పిల్లో హష్మీ ఆరోపించారు. ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో చిక్కుకున్న యువత.. వాటికి బానిసలుగా మారుతున్నారని చెప్పారు.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్, గేమింగ్ యాప్‌లకు బానిసలుగా మారుతుండటంతో యువత జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నాడు హష్మీ. యూత్‌ను తప్పుదోవ పట్టించేలా క్రికెటర్లు, సినీతారల అడ్వర్టయిజ్మెంట్లు ఉన్నాయని పిల్లో చెప్పుకొచ్చారు. ఇందులో గంగూలీ, రోహిత్, హార్దిక్‌తో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పేరును కూడా చేర్చారు. అడ్వర్టయిజ్మెంట్లు, గేమింగ్ షోల ద్వారా ఐపీఎల్లో టీమ్స్‌ను తయారు చేసుకోవాలని యాడ్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ యాడ్స్‌కు ఆకర్షితులైన యూత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పిల్లో చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో కొంతమంది డబ్బులు గెలుచుకుంటున్నారని.. అయితే చాలా మంది వీటికి బానిసలుగా మారుతున్నారని.. ఈ ప్రమాదకర జూదంలో చిక్కుకుంటున్నారని పిల్లో హష్మీ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 22న విచారణ చేపట్టనుంది ముజఫర్‌పూర్ కోర్టు. ఇకపోతే, ‘డ్రీమ్ 11’ సంస్థకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సౌరవ్ గంగూలీలు ప్రచారకర్తలుగా ఉన్నారు. ఐపీఎల్ జరుగుతున్న క్రమంలో డ్రీమ్ 11 యాడ్స్ కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. వీళ్లే కాదు.. యంగ్ క్రికెటర్స్ అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ సిరాజ్‌లు కూడా ఈ ప్రకటనల్లో కనిపిస్తున్నారు. ఈ పిల్‌పై ముజఫర్‌పూర్ న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.