పంజాబ్- రాజస్థాన్ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోయినా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ తో రాజస్థాన్ కు ఒక స్టార్ బ్యాటర్ దొరికినట్లైంది.
ఐపీఎల్ 2023 సీజన్లో మ్యాచ్ నంబర్ 8 ఎంతో ఉత్కంఠగా సాగింది. గువహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్- పంబాజ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. మ్యాచ్ పంజాబ్ గెలిచినా కూడా.. రాజస్థాన్ ప్లేయర్ మాత్రం హృదయాలు గెలుచుకున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు సీనియర్ బౌలర్లను సైతం అస్సలు లెక్కచేయకుండా విజృంభించాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే సామ్ కరణ్, అర్షదీప్ లాంటి వాళ్లు విసిరే బంతులను అలవోకగా బౌండిరీకి తరలించాడు. అందరూ ఇప్పుడు అసలు ఎవరీ ధ్రువ్ జురెల్ అంటూ వెతుకులాట ప్రారంభించారు.
ధ్రువ్ జురెల్.. పంజాబ్ మ్యాచ్ ముగిసిన దగ్గరి నుంచి ఈ పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఇతని బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అతని ప్రదర్శన ఆ రేంజ్ లో ఉంది మరి. అనుభవం ఉన్న వాళ్లని సైతం గల్లీ బౌలర్లుగా మార్చేసి ఇరగదీశాడు. ఓటమి అంచుల్లో ఉన్న రాజస్థాన్ జట్టులో గెలుపు ఆశలను చిగురింపజేశాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 32 పరుగులు స్కోర్ చేసి అజేయంగా నిలిచాడు. ఒక్కో బాల్ ని అతను బౌండిరీకి తరలిస్తుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టి.. అతను చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ ఓడినా రాజస్థాన్ కు ఒక జెమ్ లాంటి ప్లేయర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.
Dhruv Jurel was the hero of the night.
Just 22 year old and such a performance under pressure! pic.twitter.com/otzanv3dhq
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2023
హెట్ మేయర్ తో కలిసి దాదాపుగా పంజాబ్ జట్టును ఓడించినంత పని చేశాడు. ఈ 22 ఏళ్ల ధ్రువ్ జురెల్ ఎవరంటే.. ఆగ్రాకి చెందిన ఈ కుర్రాడిని కెప్టెన్ ధ్రువ్ అంటారు. ఇతను వికెట్ కీపర్- బ్యాటర్. ఇండియా అండర్ 19ఏ, ఇండియా అండర్ 19, ఉత్తరప్రదేశ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కెప్టెన్ గా ధ్రువ్ జురెల్ 2019లో ఇండియాకి అండర్ 19 ఏషియా ట్రోఫీని అందించాడు. బౌలర్లను తెలివిగా వాడుకుని 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం నమోదు చేశాడు. ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 2022లో రాజస్థాన్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, గత సీజన్లో అవకాశం దక్కలేదు. ఈ ఏడాది కూడా ధ్రువ్ జురెల్ ఐపీఎల్ ఫీజ్ రూ.20 లక్షలు. ఇంపాక్ట్ ప్లేయర్ గా పంజాబ్ పై మ్యాచ్ లో అరంగేట్రం చేసి ఇరగదీశాడు. ధ్రువ్ జురెల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
*Dhruv jurel* 🔥🏏#DhruvJurel @dhruvjurel21 #RRvPBKS
Best Shot By A Debutant IPL Players So Far…😍 pic.twitter.com/i1BstP4PCY
— RR True Fans 💗 🔥 🏏 Royal Family 👑 (@MeenaRamkishan0) April 6, 2023