ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.., ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి..! ఇది ఓ సినిమా పాట. కానీ.., ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మన తెలుగుతేజం అంబటి రాయుడు చూపిస్తున్న పోరాటాన్ని చూస్తే.. ఈ మాటలు గుర్తురాక మానవు. తన జీవితంలో అంబటి రాయుడు చూసిన ఒడిదొడుకులు, నేర్చుకున్న గుణపాఠాలు అన్నీ ఇన్నీ కావు. రాయుడికి ఆట మీద మోజు, టీమిండియా జట్టులోకి రావాలనే ఆశ చావలేదు అని చెప్పే మరో ఉదాహరణను పంజాబ్ మ్యాచ్ లో కళ్లారా చూశాం. అసలు అంబటి రాయుడు కోరుకుంటున్నదేంటి? అది ఆశ అవుతుందా? అత్యాశగా లెక్కగడతారా? రాయుడు ఎందు ఈ పోరాటం చేస్తున్నాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇదీ చదవండి: స్లో బ్యాటింగ్‌తో మ్యాచ్ పోగొట్టిన జడేజా! అంతా ఐపోయాక సిక్స్..
ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు మొత్తం చేతులెత్తేసినా రాయుడు మాత్రం పోరాటం ఆపే రకం కాదు. రాయుడు క్రీజులో ఉన్నంతవరకు జట్టు గెలుపు గుర్రం మీద ఉన్నట్లే. అతని పోరాటం గురించి చెప్పాలంటే ఒక్క పంజాబ్ మ్యాచ్ ను ఉదాహరణగా తీసుకుంటే చాలు. 188 పరుగుల లక్ష్యంతో గేమ్ స్టార్ చేసిన చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో రాయుడు అడ్డుగా నిలబడ్డాడు. అప్పటివరకు వీరవిహారం చేసిన పంజాబ్ బౌలర్లను కాసేపు వణికించాడు. ప్రతి బాల్ ను బౌండిరీకి తరలిస్తూ ముచ్చెమటలు పట్టించాడు. జట్టులో స్థానం గురించి ప్రస్తావన వస్తే రాయుడికి 36 ఏళ్లు గుర్తు చేసే వారికి.. వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపించాడు. 200 స్ట్రైక్ రేట్ తో 6 సిక్సులు, 7 ఫోర్లతో కేవలం 39 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. రాయుడు ఇంకా ఒక నాలుగు బంతులు ఆడినా చెన్నై టీమ్ విజయం సాధించేది. రాయుడు క్రీజులో ఉంటే అభిమానులకు అంత నమ్మకం.
#csk#AmbatiRayudu
What a shot!!!!
Super performance…
Experience batting.
Fighting abilities of rayadu is the benchmark of csk. pic.twitter.com/vkoKkjRgFn— Raj (@Raju43130369) April 26, 2022
ఇదీ చదవండి: ముంబైని ముంచేసిన కిషన్ పై రోహిత్ సీరియస్ అయ్యాడా?
రాయుడుకి బాగా తెలుసు ఇక్కడ ఒక ఆట, పోరాటం ఉంటే మాత్రమే సరిపోదు అని. కానీ, తన ఆటనే ఒక ఆయుధంగా చేసుకుని.. గేమ్ పేరిట జరిగే ఎన్నో కుళ్లు రాజకీయాలపై పోరాటం సాగిస్తున్నాడు. చూస్తున్న అభిమానులన్నా విసిగిపోయారేమో గానీ, రాయుడు మాత్రం ఇంకా ఓటమిని అంగీకరించలేదు. ఎందుకంటే అతను ఈ 36 ఏళ్ల జీవితంలో ఎన్నో రాజకీయాలు చూశాడు. అయినా ఈసారైనా అతనికి అవకాశం దొరుకుతుందని కచ్చితంగా నమ్మడు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ఎన్నో చేజార్చుకున్న ట్రాక్ రికార్డ్ అంబటి రాయుడు సొంతం కాబట్టి. కానీ, రాయుడు అలాంటి వాటిని పట్టించుకోడు. అది పొగరు అని భ్రమ పడకండి.. దానిని ఆత్మాభిమానం అంటారు. జట్టు కాదనుకున్నా.. జట్టును గెలిపించాలని కసితో ఉన్న అంబటి రాయుడికి మనస్ఫూర్తిగా హేట్సాఫ్ చెప్పాల్సిందే. టీమిండియాలో చోటు సంపాదించాలని అంబటి రాయుడు చేస్తున్న పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.