హిందువులు అత్యంత వైభవంగా, అత్యంత పవిత్రంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినాల్లో మహా శివరాత్రి ఒకటి. ఈరోజున హిందువులు శివుడికి ప్రత్యేకించి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అయితే పూజలు చేసేవారు ఈ శివరాత్రి పర్వదినాన ఈ పొరపాట్లు చేస్తే ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు.
పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, శివుడు, హాలాహలాన్ని గొంతులో పెట్టుకున్న నీలకంఠుడు, మహా దేవుడు, శంకరుడు, రుద్రుడు, హర హర మహాదేవ, ఈశ్వరుడు, మహేశ్వరుడు ఇలా అనేక నామధేయాలు కలిగిన శివుడు తాండవం ఆడిన రోజు ఈరోజు. శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు కూడా ఈరోజే. ప్రతీ నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అని అంటారు. మామూలుగా భక్తులు కోరిన కోరికలను మరోమాట ఆలోచించకుండా నెరవేరుస్తాడని చెబుతారు. భక్తవ శంకరుడు భోళా శంకరుడికి ఇష్టమైన మహా శివరాత్రి పండుగను ఆయనకు నచ్చినట్టు జరుపుకుంటారో వారికి శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహా శివరాత్రి వచ్చింది.
మహా శివరాత్రి నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమా రావి గారు చెప్పారు. శివ సంబంధమైన పూజ, శివ ధ్యానం, శివుడి కోసమే ఉపవాసం, శివుడి కోసమే జాగరణ చేయాలి. ఎంత శివ సంబంధం కలిగి ఉంటామో.. శివ ధ్యానం ఎంత బాగా చేస్తామో అంత ఫలితం ఉంటుంది. శివ ధ్యానం చేయడం తెలియకపోయినా.. ఆరోజు జాగరణ ఉండి శివ నామస్మరణ చేస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు అని, శివుడు నిత్యుడు అని రుజువు చేయబడిన రోజు. ఆది యోగి అని, పరమేశ్వరుడు ఢమరుక నాదం నుంచి భాష వచ్చిందని అన్నారు. నిత్యం తపస్సు చేస్తూ కనబడే వ్యక్తి శివుడు. అలాంటి నిత్య తపస్వి అయిన శివుడ్ని ఆరాధిస్తే యోగ సాధనలో ముందుకు వెళ్లారు.c శివుడు ఐశ్వర్య ప్రదాత, మోక్ష ప్రదాత.
జీవించినంతకాలం ఐశ్వర్యాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించే దేవుడు శివుడని ఆమె వెల్లడించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. ఇంత ముఖ్యమైన రోజుని అస్సలు మిస్ అవ్వకూడదని అన్నారు. దుర్భాషలాడటం, అక్కర్లేని మాటలు మాట్లాడడం, వాదులాటకి, గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటే శివానుగ్రహం లభిస్తుందని.. ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉంటే బాగుంటుందని అన్నారు. మహా శివరాత్రి నాడు శివుడికి ఒక రోజు కేటాయిస్తే ఆయన మీ జీవితం మొత్తానికి ఆయన సమయాన్ని కేటాయిస్తారు అని పెద్దలు చెబుతారు. మరి ఈ మహా శివరాత్రి పర్వదినాన్ని అత్యంత నిష్టగా జరుపుకుంటారని ఆశిస్తూ సుమన్ టీవీ యూజర్లకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. మహా శివరాత్రి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి, విశిష్టత గురించి తెలుసుకోవడం కోసం కింద వీడియో చూడగలరు.