SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Details About Various Benefits From Credit Card Companies For Customers

Credit Card: మీకు క్రెడిట్‌ కార్డు ఉందా? అయితే మీరు ఇది చదవాల్సిందే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 14 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Credit Card: మీకు క్రెడిట్‌ కార్డు ఉందా? అయితే మీరు ఇది చదవాల్సిందే!

క్రెడిట్‌ కార్డు.. ప్రస్తుతం ఎంతో మందికి ఇదే ప్రధాన చెల్లింపు సాధనంగా మారుతోంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా క్రెడిట్‌ కార్డు వాడకం కూడా బాగా పెరిగింది. అంతేకాకుండా బ్యాంకులు సైతం ఖాతాదారులను క్రెడిట్ కార్డు తీసుకునేలా, వాటిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ చాలా మందికి అసలు క్రెడిట్‌ కార్డు ద్వారా వారు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో, క్రెడిట్‌ కార్డు నుంచి ఏ విధంగా లాభపడవచ్చో తెలియదు. కొందరికి దానిని ఉపోయోగించడం తెలియక ఇబ్బందులు కూడా పడుతుంటారు. అయితే అలాంటి వారికోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవగాహన కల్పిస్తోంది. అయితే అసలు క్రెడిట్‌ కార్డును ఎలా ఉపయోగించాలి? దానిద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో చూద్దాం.

టైమ్‌కి చెల్లించాలి:

మీకు క్రెడిట్‌ కార్డులో బిల్‌ జనరేట్‌ డేట్‌, డ్యూ డేట్‌ అని రెండు ఉంటాయి. ఈ రెండింటిన అస్సలు మర్చిపోకూడదు. బిల్‌ జనరేషన్‌ డే అంటే.. ఆ రోజు మీరు క్రెడిట్‌ కార్డుతో చేసిన చెల్లింపులను పరిగణలోకి తీసుకుని బిల్‌ని జనరేట్‌ చేస్తుంది. బిల్‌ జనరేట్‌ అయిన తర్వాత డ్యూ డేట్‌ రోజు లేదా అంతకంటే ముందే మీరు మీ క్రెడిట్‌ కార్డు బిల్లుని కట్టాల్సి ఉంటుంది. అలా కట్టడంలో విఫలమైతే మీకు అదనంగా ఫైన్స్‌ పడటం, మీ సిబిల్‌ స్కోర్‌ కూడా తగ్గడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ మీరు చెల్లింపులను డ్యూ డేట్‌లోపే చెల్లించాలి. అలా చేస్తే మీరు ఎలాంటి అదనపు రుసుములు, ఇబ్బందులు లేకుండా 40-45 రోజుల వడ్డీలేని పిరియడ్‌ని వాడుకోవచ్చు.

రివార్డులు:

ప్రతి క్రెడిట్‌ కార్డుకు రివార్డుల ఇచ్చే విధానం ఉంటుంది. మీరు ఖర్చుచేసే ప్రతి రూపాయిని వాళ్లు పరిగణలోకి తీసుకుని అందుకు తగినట్లుగా రివార్డ్‌ పాయింట్స్‌ ఇస్తుంటారు. అయితే ఎన్ని పాయింట్లు ఇస్తారు అనేది వాళ్ల షరతులు, మీరు తీసుకునే క్రెడిట్‌ కార్డుని బట్టి ఉంటుంది. ఆ రివార్డు పాయింట్లు మాకెందుకు అనుకుంటున్నారా? అయితే ఆ రివార్డు పాయింట్లతో మీరు మళ్లీ షాపింగ్‌ చేయవచ్చు. అన్ని బ్యాంకులు వారు ఇచ్చే రివార్డు పాయింట్లను వినియోగించుకునేందుకు కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ప్రొడక్టలను అందుబాటులో ఉంచుంది. వారు ప్రొడక్టుకు పెట్టిన పాయింట్లను బట్టి మీ వద్ద రివార్డులకు తగ్గట్లు వస్తువును ఎంచుకోవచ్చు. ఒకవేళ వస్తువుకు సరిపోను పాయింట్లు లేకపోతే ఎక్స్‌ ట్రా ఎంతకట్టాలో చూపిస్తారు. అందుకు తగినట్లు మీరు రివార్టు పాయింట్లను వినియోగించుకోవచ్చు. అంటే ఇది ఖర్చు మీద వచ్చే ఆదాయం అనమాట.

ప్రత్యేక డిస్కౌంట్లు:

క్రెడిట్‌ కార్డులపై మీకు స్పెషల్‌ డిస్కౌంట్లు ఇస్తుంటారు. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు సంస్థలు కొన్ని కంపెనీలు, ఇ-కామర్స్‌ వంటి సైట్లతో ఒప్పందాలు చేసుకుంటాయి. వాటి ఒప్పందాల ప్రకారం ఫలానా సైట్‌లో, ఫలానా కంపెనీ ఉత్పత్తులకు చెల్లింపులు చేసే సమయంలో మా బ్యాంకు ద్వారా చెల్లిస్తే మీకు అదనంగా 10శాతం డిస్కౌంట్‌ లభిస్తుంటుందని వెల్లడిస్తాయి. ఇలాంటివి ఎక్కువగా ఫెస్టివల్‌ సీజన్లు, మెగా సేల్స్‌, కొన్ని షోరూమ్ల ఆఫర్లలో వస్తుంటాయి. ఇవి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఇలా రెండు విధాలుగా షాపింగ్‌ చేసే సమయంలో వాడుకోవచ్చు. దీనిద్వారా కంపెనీ ఆ ప్రొడక్టు మీద ఇచ్చే డిస్కౌంట్స్‌, ఆఫర్లకు అదనపు ప్రయోజనం అనమాట.

ట్రావెల్‌ బెనిఫిట్స్‌:

కొన్ని కొన్ని క్రెడిట్‌ కార్డ్స్‌ ట్రావెల్‌ బెనిఫిట్స్‌ ను బాగా ఆఫర్‌ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు అయితే ఎక్కువగా ట్రావెల్‌ చేసేవారికి ప్రత్యేకంగా ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు అంటూ తీసుకొచ్చాయి కూడా. ఈ కార్డుల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీకు రెండు, మూడు నెలలకొకసారి ఫ్రీగా ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌కి ప్రవేశం కల్పిస్తారు. కొన్నిసార్లు హోటల్స్‌ ఫ్రీగా స్టే చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇంక యాత్రా డాట్‌ కామ్‌, మేక్‌ మై ట్రిప్‌ వంటి వెబ్‌సైట్లతో కలిసి మీకు అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తుంటాయి. ఇంక కార్డు భద్రత విషయానికి వస్తే.. కార్డు వెనుకవైపు ఉండే సీవీవీ, వాలిడిటీ, ఎక్స్‌పైరీ వంటివి ఎవరితో పంచుకోకూడదు. బ్యాంకులు కూడా అలాంటి సమాచారాన్ని అడగవు. షాపింగ్‌ సమయంలోనూ బాగా నమ్మదగిన సైట్లలోనే మీ సమాచారాన్ని ఎంటర్ చేయండి. ఈ చిట్కాలను పాటించి మీ క్రెడిట్‌ కార్డు మీద వచ్చే అన్ని ప్రయోజనాలను అందుకోండి.

  • ఇదీ చదవండి: RBI నిర్ణయంతో.. బ్యాంకు ఖాతాదారులకు భారీ రాబడి!
  • ఇదీ చదవండి: ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా..? అయితే మీకో శుభవార్త!
  • ఇదీ చదవండి: కొత్త కారు కొనాలనుకునే వారికి దీపావళి బంపరాఫర్‌.. ఏకంగా 40 వేలు తగ్గిస్తూ!

Tags :

  • business news
  • Credit Card
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam