వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ సోషల్ మెసేజింగ్ యాప్ టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం మెసేజ్‌లు, గ్రూప్ చాటింగ్, వీడియోకాల్, గ్రూప్ వీడియోకాలింగ్, పేమెంట్స్ కోసం కూడా వాట్సాప్‌ని వినియోగిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల కోసం అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. యూజర్ల ప్రైవసీ పరిరక్షణకు వాట్సాప్ ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఓ వైపు ఎంతో భద్రత తో కూడిన అప్ డేటెడ్ వెర్షన్లను అందిస్తూనే మరొకవైపు యూజర్లకు సైతం కొన్ని నియమ, నిబంధనలు పెట్టింది. తమ యూజర్లు స్పామ్, స్కామ్ లలో పాలు పంచుకున్నా..లేకుంటే నిబంధనలను ఉల్లంఘించినా వారి వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేస్తుంది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా అనేక ఫేక్ న్యూస్ లు లో వైరల్ అవుతున్నాయి. తమకు వచ్చిన వార్తపై నిజా, నిజాలు తెలుసుకోకుండా కొందరు ఇతరులకు ఫార్వార్డ్ చేస్తుంటారు. వీటి వల్ల అనేక చెడు పరిణామాలు జరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది వాట్సాప్. మనకు వాట్సాప్ లో ఏదైనా మెస్సేజ్ లేదా ఇమేజ్ వచ్చిందనుకోండి. అందులో నిజం ఎంతో తెలుసుకోకుండా వేరొకరికి ఫార్వార్డ్ చేయవద్దు. వాట్సాప్ లో ఏదైనా ఒకే సారి ఐదు మందికి మించి ఫార్వార్డ్ చేయలేము. ఇంకో సారి మరో ఐదుగురికి చొప్పున సందేశాలు పంపించుకోవచ్చు.
కానీ, ఈ నిబంధన యూజర్లను అప్రమత్తం చేసేందుకే.ఎవరైన అస్తవాలను ఫార్వర్డ్ చేసిన, పెద్ద మొత్తంలో మెస్సెజ్ లోను ఇతరులకు పంపించ వద్దు. అలా చేసే వారిని వాట్సాప్ స్పామ్ స్టర్ గా గుర్తిస్తుంది. దీనికోసం సదరు సంస్థ మెషిన్ లర్నింగ్ టెక్నాలజీ వాడుతుంది. ఒక కాంటాక్ట్ నుంచి ఏదైనా సందేశం తొలిసారి వస్తే.. స్పామ్, బ్లాక్ చేయాలా? అని యూజర్ కి నోటిఫికేషన్ వస్తుంది. యూజర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. బ్రాడ్ కాస్ట్ కు సంబంధించిన సందేశాలనుల తరచుగా పంపించొద్దు. ఇలా చేస్తే.. వాటిని అందుకున్న వారు మీ అకౌంట్ పై రిపోర్టు చేయవచ్చు. అప్పుడు అకౌంట్ బ్లాక్ అయిపోతుంది.
ఎవరైన తమకు మెస్సేజ్ పంపవద్దుని అభ్యతరం చెప్తే.. పంపకపోవడమే ఉత్తమం. ఎందుకంటే అవతలి వ్యక్తి యూజర్ రిపోర్ట్ చేశారంటే మన వాట్సాప్ ఆకౌంట్ పై వేటు పడుతుంది. తప్పుడు మెస్సేజ్ లను, చట్టవిరుద్ధమైన చర్యలు, వ్యక్తులు, సంస్థల పరువుకు భంగం కలిగించే పనులకు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ లో ఇలానే 23 లక్షల వాట్సాప్ ఖాతాలను భారత్ లో బ్లాక్ చేసింది. కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్ లకి, స్పామ్ లకు దూరంగా ఉంటడటం ఉత్తమమైన పని.