బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదుంది. అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కు వల్ల ఎవరు ఏ టీమ్, ఏ గ్రూప్ అనేది ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చింది. రెండు గ్రూపులుగా విడిపోయి రెండ్రోజులు తెగ కొట్టేసుకున్నారు. పోలీసులు, దొంగలు అని నానా తిప్పలు పడ్డారు. బిగ్ బాస్ మధ్యలో పిలిచి క్లాస్ కూడా పీకాడు. కానీ, చాలా మంది రూల్స్ కి వ్యతిరేకంగానే గేమ్ ఆడారు. ఎట్టకేలకు 71 బొమ్మలు సేవ్ చేసి పోలీసుల టీమ్ విజయం సాధించింది. పోలీసుల టీమ్ నుంచి ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్‌గా, గోల్డెన్ ఎగ్ ఉన్నందుకు శ్రీ సత్యకి కూడా కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం వచ్చింది. ఇంక గీతూ తనకి ఇచ్చిన టాస్కులో విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. దొంగల బ్యాచ్ నుంచి బెస్ట్ పర్ఫార్మర్గా శ్రీహాన్‌కు అవకాశం కల్పించారు.
శ్రీ సత్య, గీతూ రాయల్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. ఈసారి కెప్టెన్సీ పోటీని రెండు రౌండ్లుగా పెట్టడం జరిగింది. మొదట పిరమిడ్ అనే టాస్కు పెట్టారు. అందులో కొన్ని బ్రిక్స్ ని తీసుకుని వారికి ఇచ్చిన టేబుల్ మీద పిరమిడ్‌లా పెట్టాలి. ఒకరికి మాత్రం ఒక బ్రిక్ తక్కువ వస్తుంది. అలా తక్కువ వచ్చిన వాళ్లు టాస్కు నుంచి మొదట ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత నలుగురు కంటెండర్లు ఇంటి సభ్యుల నుంచి వాళ్ల పిరమిడ్లను కాపాడుకోవాల్సి ఉంటుంది. బాల్స్ తో బ్రిక్స్ పడగొట్టేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నిస్తారు. ఈసారి బ్రిక్స్ టచ్ చేసి రూల్స్ పాటించలేదని సంచాలక్ రేవంత్ ఫైమాని ఎలిమినేట్ చేస్తాడు. ఇంక రెండో రౌండ్‌కి ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య క్వాలిఫై అయ్యారు.
రెండో రౌండ్లో ఆదిరెడ్డి అద్భుతమైన ప్రదర్శన చేసి మూడోవారం కెప్టెన్‌గా నిలిచాడు. ఒక బిగ్ బాస్ రివ్యూవర్‌గా, కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్‌లో అడుగుపెట్టిన ఉడాల్ మామ ఈ స్థాయిలో రాణించడం చూసి ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజానికి ఈ కెప్టెన్సీ టాస్కు, కంటెండర్ల టాస్కుల్లో కాస్తో కూస్తో రూల్స్ పాటించింది ఆదిరెడ్డి అనే చెప్పొచ్చు. రెండు గ్రూపులకు గొడవలు జరుగుతున్న సమయంలోనూ ఆదిరెడ్డి ఫిజికల్ కాకండి అంటూ అందరినీ బతిమిలాడుతూ తన టీమ్ కాస్త సంయమనం పాటించేలా చూసుకున్నాడు. ఆదిరెడ్డి హౌస్‌ని కూడా సమర్థంగా నడిపించగలడని ఇంట్లోని సభ్యులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. బిగ్ బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి ఆట ఎలా ఉందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.