బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈసారి ఎందుకో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి హౌస్‌లో ఏ సీజన్లో లేని విధంగా గొడవలు జరుగుతున్నాయి. టాస్కులు కూడా ఎంతో కొత్తగా, టఫ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ప్రతి అంశంలో ఒక గొడవకు ఆస్కారం ఉండేలా చూస్తున్నారు. కానీ, ఈసారి సీజన్‌కు అంతగా ఆదరణ లేదనే చెప్పాలి. హౌస్‌లో జంటలు అంటే ముందుగా ఆర్జే సూర్యా, ఆరోహీల పేరు వినిపిస్తుంది. కానీ, అసలు వీళ్లేమో మేం లవర్స్ కాదని మొత్తుకుంటున్నారు. హౌస్‌లో వీళ్ల ప్రవర్తన చూస్తే ఎవరైనా వీళ్లు లవర్స్ అని తప్పకుండా చెప్పుకుంటారు. హౌస్‌లో ఏ విషయం ఉన్నా ఇద్దరు కలిసే చేస్తారు, కలిసే ఆడతారు, కలిసే తింటారు. కానీ, వీళ్ల మధ్య ఏం ఉంది అంటే నో కామెంట్ అంటారు.
పూల్ పక్కన చీకట్లో ముచ్చట్లు పెట్టుకున్న వీళ్లదరిని.. శ్రీ సత్య వచ్చి అసలు మీ మధ్య ఏముంది అని అడిగితే.. ఏం సమాధానం కూడా చెప్పలేదు. నాగార్జున సైతం మీ మధ్య ఏం ఉంది అంటూ చాలాసార్లు అడిగారు. మూడేళ్లలో కలగనిది ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అంటూ ఆరోహీ ఎస్కేప్ అయ్యింది. వీళ్లిద్దరి ఫొటోని చూపించగా ఇద్దెక్డి అంటూ గోల చేశారు. ఆ సమయంలో సూర్యా.. నందు ఏమైనా ఫీలై ఉంటాడా? అనే ప్రశ్న అడిగాడు. అప్పటివరకు అసలు ఆ నందు అనే పేరు ఎవరికీ తెలియదు. ఆ నందు ఎవరో అని అనుకున్నారు. కానీ, ఆ నందు ఎవరో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆ నందు అనే వ్యక్తి ఆరోహీ లైఫ్‌లో ఉన్న స్పెషల్ పర్సన్ అంట. అందుకే ఫీలై ఉంటాడా? అని అడిగాడు. మరి నందు స్పెషల్ పర్సన్ అయితే సూర్యా ఎవరు? ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండా? ఫ్రెండ్ కంటే ఎక్కువా? ఆ ప్రశ్నలపై క్లారిటీ ఆరోహీనే ఇవ్వాలి మరి.