బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రేటింగ్స్ లో దూసుకువెళ్లడం పక్కన పెడితే నెగెటివిటీలో తెగ పాపులర్ అవుతోంది. రాను రాను బిగ్ బాస్ టాస్కులు మరీ దరిద్రంగా తయారయ్యాయి అంటూ బుల్లితెర తెలుగు ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు మరీ దిగజారిపోతున్నారంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు టాస్కుల్లో గ్రూపులు చేసి కొట్టుకోమని ప్రోత్సహించిన బిగ్ బాస్ ఇప్పుడు స్కిన్ షోని తెగ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నడుస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో ఇంట్లోని సభ్యులు మరీ రెచ్చిపోతున్నారు. హోటల్ వర్సెస్ హోటల్ అంటూ ఇచ్చిన టాస్కులో హౌస్‌లోని సభ్యులను రెండు గ్రూపులు చేశారు. అయితే ఒక హోటల్‌ను కేవలం అమ్మాయిలు నడిపేలా ప్లాన్ చేశారు.
అమ్మాయిల హోటల్‌కి గ్లామ్ ప్యారడైజ్ అంటూ నామకరణం చేశారు. అందులో ఫైమా, శ్రీ సత్య, ఆరోహీ, వాసంతి, కీర్తీలకు పొట్టి పొట్టి డ్రెస్సులు పంపారు. ఆ హోటల్లో వాళ్లేమో హెడ్ మసాజ్, బాడీ మసాజ్, థాయ్ మసాజ్ అంటూ టాస్కులో గెలిచేందుకు నానా యాగి చేశారు. ఆరోహీ అయితే ఆర్జే సూర్యాకి ఆయిల్ మసాజ్ చేసింది. మనోడు షర్ట్ తీసి షార్ట్ మీద పడుకుని ఆయిల్ మసాజ్ చేయించుకున్నాడు. ఈ దృశ్యాలు చూసిన సగటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఇదేం బాగోతంరా బాబు అంటూ నోరెళ్లబెడుతున్నారు. తెలుగు నంబర్ వన్ రియాలిటీ షో అని ఊదరగొడుతూ ఈ కక్కుర్తి పనులు ఏంటని గడ్డిపెడుతున్నారు. అంతేకాకుండా సీపీఐ నారాయణ బ్రోతల్ హౌస్ అని పేరుపెట్టడంలో తప్పే లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈ టాస్కులో భాగంగా గ్లామ్ ప్యారడైజ్ సెట్లో ఒక పోల్ ని ఏర్పాటు చేశారు. సమయానుసారంగా పాటలు ప్లే చేస్తే ఇంట్లోని సభ్యులు అక్కడ డాన్సులు చేయాలి. అలా డాన్సులు చేస్తే అతిథులు మెచ్చుకుని వారి ప్రదర్శనకు తగ్గట్లు టిప్ కూడా ఇస్తారు. అయితే అక్కడ వ్చచే పాటలు, వాళ్లు వేసుకున్న దుస్తులు, వాళ్లు వేసే స్టెప్పులు అన్నీ నైట్ క్లబ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ చేష్టలు చూసిన ప్రేక్షకులు ఈ టాస్కుతో మీరు ఏం ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి టాస్కులతో మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అంటూ ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంటి సభ్యుల ప్రదర్శన చూస్తుంటే అందరూ నైట్ క్లబ్లో క్యాబరీ డాన్సులు చేసే వారిలా ఉన్నారు, వీళ్లు నిజంగా సెలబ్రిటీలేనా? అంటూ కొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు. ఈ డాన్సులపై మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.