బిగ్ బాస్ ప్రతి సీజన్ లోనూ హగ్గులు-కిస్సులు లాంటివి చాలా కామన్. దానిపై విమర్శలు వచ్చినా సరే.. బిగ్ బాస్ టీమ్ వాటిని మాత్రం వదులుకోదు. ఈసారి ఆరోహి-సూర్య.. ఆ బాధ్యతని భుజానేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే రెచ్చిపోతున్నారు. ముద్దుల కోసం కోడ్ లాంగ్వేజ్, ఆరోహి సైగలు చేయడం లాంటివి చూస్తున్న నెటిజన్స్ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే మగాళ్లనే నమ్మనని గట్టిగా అనుకున్న ఆరోహి.. ఇప్పుడు ఏకంగా ముద్దులు కావాలని అంటోంది. ఇక ఫెమినిస్ట్ సూర్య అయితే.. ఆరోహితో లైవ్ లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నాడు. ఇంతకీ వీళ్ల మధ్య ఏముంది? ఏం జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. దీనికి ప్రతి సీజన్ లోనూ పలువురు కంటెస్టెంట్స్ వీలైనంత డ్రామా పండిస్తుంటారు. లవ్ ట్రాకులు కూడా నడుపుతుంటారు. గత కొన్ని సీజన్ల విషయమే తీసుకుంటే.. మూడో సీజన్ లో రాహుల్-పునర్నవి జోడీ తర్వాత ఇలాంటి స్ట్రాటజీలు ఎక్కువయ్యాయి. నాలుగో సీజన్ లో అభిజిత్-హారిక, అరియానా-అవినాష్, ఐదో సీజన్ లో శ్రీరామచంద్ర-హమీద.. హౌసులో ప్రేమ పండిస్తూ వార్తల్లో నిలిచారు. ఇక ఈ సీజన్ లో మాత్రం తొలి రెండు వారాలు పెద్దగా ఎవరి మధ్య బాండింగ్ కుదరలేదు. అర్జున్, శ్రీసత్యతో పులిహోర కలిపి ప్రయత్నం చేస్తున్నాడు గానీ అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో అందరి దృష్టి హగ్గులు, కిస్సులతో రచ్చ చేస్తున్న ఆరోహి-సూర్యపై పడింది.
సూర్యని తీసుకుంటే.. స్టార్టింగ్ నామినేషన్స్ లో తనని తాను ఫెమినిస్ట్ గా ఎష్టాబ్లిష్ చేసుకున్నాడు. అమ్మాయిలకు ఏమైనా జరిగితే ఊరుకోనని గట్టిగా చెప్పాడు. మరోవైపు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మగాళ్లని అస్సలు నమ్మనని ఆరోహి చెప్పింది. అలాంటిది వీళ్లిద్దరూ హౌసులో ఫుల్ ఘాటు రొమాన్స్ పండిస్తున్నారు. హగ్గుల వరకు అంటే ఓకే గానీ ఏకంగా ముద్దులు కావాలని పెదాలతో సైగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లిప్ కూడా వైరల్ గా మారింది. మంగళవారం ఎపిసోడ్ లో ఇద్దరూ ఎప్పటిలానే హగ్ చేసుకుని రొమాన్స్ పండించారు. ఇక ఆరోహి, వేరే వాళ్లతో క్లోజ్ గా ఉందని సూర్య.. సూర్య వేరే వాళ్లతో క్లోజ్ గా ఉన్నాడని ఆరోహి తెగ ఫీలైపోయారు.
Please Do Vote #Arohi Wonderful Performance. #BiggBossTelugu6 pic.twitter.com/UPMmci9gy8
— ѕє7єη ✪ (@BHA5K4R) September 20, 2022
ఆ తర్వాత సూర్య మంచంపై పడుకుని ఉంటే అతడితో వెళ్లి.. ఎఫెక్షన్ గురించి ముచ్చట్లు పెట్టింది. మిగతా వాళ్లకంటే నువ్వు స్పెషల్ అన్నట్లు చెప్పింది. ఇక అయిపోయిందేదో అయిపోయింది.. పెదాలతో కిస్ కావాలా అన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. వీళ్ల మధ్య అలక వచ్చిన ప్రతిసారీ కూడా కిస్ సౌండులు చేసుకుంటూ కనిపిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. వీళ్ల లవ్ ట్రాక్ ఏంటో గానీ.. మసాలా మాత్రం గట్టిగా దట్టిస్తున్నారు. గేమ్ లో కాకపోయినా సరే రొమాన్స్ తో అయినా సరే కెమెరా కంటపడాలని తెగ ట్రై చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో కూడా ఉన్నారు కాబట్టి.. వీకెండ్ వచ్చేలోపు ఇలాంటి రొమాన్స్ ఇంకా పెరిగిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది! అయితే ఈ రొమాన్స్, కెమిస్ట్రీ అంతా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేయడానికా, లేదంటే నిజంగానే ఇలా చేస్తున్నారా అని నెటిజన్స్ సందేహపడుతున్నారు. మరి ఆరోహి-సూర్య రెచ్చిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: మరీ దారుణం తయారైన బిగ్ బాస్ హౌస్! ఇది ఫ్యామిలీతో చూసే షోనా?