బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారంలో ఇంటికి కొత్త కెప్టెన్ వచ్చాడు. మొదటివారంలో కెప్టెన్‌గా చేసిన బాలాదిత్య టర్మ్ ముగిసిపోయింది. రెండోసారి కెప్టెన్ అయ్యేందుకు బాలాదిత్య అంత ఇంట్రస్ట్ చూపించలేదు. మిగిలిన వాళ్లకు ఛాన్స్ ఇస్తానంటూ తను కెప్టెన్సీ పోటీ నుంచి కావాలనే తప్పుకున్నాడు. సిసింద్రీ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో మొత్తం నలుగురు విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. మొదటి రౌండ్లో చంటి, తర్వాత ఇనయా సుల్తానా, మూడో రౌండ్లో రాజశేఖర్, నాలుగో రౌండ్లో ఈర్జే సూర్య పోటీదారులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత డీజే టిల్లు నాచో నాచో అనే టాస్క్ ని పెట్టారు. అందులో ఇద్దరు ఇంటి సభ్యులు ఒక టీమ్‌గా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలి.
ఆ టాస్కులో రాజశేఖర్‌కు 4 ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఎక్కువ ఓట్లు రాజశేఖర్‌కు రావడం వల్ల రెండోవారం కెప్టెన్‌గా రాజశేఖర్ నిలిచాడు. అయితే రాజశేఖర్ కెప్టెన్ అవ్వడాన్ని కచ్చితంగా అంతా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మొదటివారం మొత్తం రాజశేఖర్ ఎక్కడా కనిపించలేదు. స్క్రీన్ స్పేస్ కూడా లేదు. అసలు చూపించేందుకు రాజ్ బిగ్ బాస్ ఎడిటర్లకు అవకాశం కూడా ఇవ్వలేదు. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా రాజశేఖర్ గేమ్‌కు థంబ్స్ డౌన్ అన్నాడు. సోమవారం చూస్తే రాజ్ నామినేషన్స్ లోకి కూడా వచ్చాడు. ఏం అనుకున్నాడో ఏమో.. మనోడు వెంటనే ట్రాక్ మార్చాడు. అందరితో కలిసిపోవడం, ప్రతి పని లో ఇన్వాల్వ్ అవ్వడం చేశాడు.
అంతేకాకుండా ఆట విషయంలో తానేంటో అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నాడు. కెప్టెన్సీ పోటీలో ఇంట్లోని సభ్యులను తమకు ఓటేసేలా ఒప్పించాలని కూడా చెప్పారు. ఆ విషయంలో రాజ్ ఒక మంచి పాయింట్ ఎంచుకున్నాడు. “నేను నామినేషన్స్ లో ఉన్నాను. ఒకవేళ నేను కెప్టెన్ అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా నాకు ఎలాంటి రిగ్రెట్ ఉండదు. బిగ్ బాస్ హౌస్‌లో ఏదో ఒకటి సాధించాననే సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఈసారి నాకు ఓట్ వేసి గెలిపించండి” అంటూ రాజశేఖర్ అందరికీ చెప్పుకొచ్చాడు. చాలా మంది ఆ మాటకు కన్విన్స్ అయ్యారు. చివరకు రాజశేఖర్ రెండోవారం కెప్టెన్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఏది చేసైనా గెలవడానికి ట్రై చేయాలి. అదే రాజ్ చేశాడు.. చివరికి కెప్టెన్ అయ్యాడు. మోడల్ రాజ్ కెప్టెన్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.