బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ షో ప్రారంభం నుంచి అందరినీ అలరిస్తోంది. ఈ సీజన్లో పెడుతున్న పోటీలు, ఇస్తున్న టాస్కులు అన్నీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఇంట్లోని సభ్యులు సైతం కంటెంట్ ఇచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. తాజాగా సిసింద్రీ అని కెప్టెన్సీ పోటీదారుల టాస్కు జరిగిన విషయం తెలిసిందే. అందులో అందరికీ ఒక బేబీ డాల్ ఇచ్చి కన్న బిడ్డలా చూసుకోవాలని చెప్పారు. అందరూ ఎంతో బాగా ఆడారు, చూసుకున్నారు. ఆ తర్వాత ఆ బొమ్మలను తిరిగి ఇచ్చేయమని చెప్పినప్పుడు అందరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత వారి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు చెప్పుకుని ఏడ్చేశారు.
రోహిత్- మెరీనా, సుదీపా పింకీలు వారి జీవితాల్లో జరిగిన ఘటనలు, అబార్షన్ కావడం వల్ల వాళ్లు పడిన నరకయాతనను చెప్పుకుని బాధ పడ్డారు. కీర్తీ భట్ తన జీవితంలో ఎంతో కోల్పోయిందో అందరికీ వెల్లడించింది. ఈ టాస్కు మొత్తంలో అందరూ ఎంతో రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. కానీ, ఒక్క వాసంతి కృష్ణన్ మాత్రం ఆ బొమ్మతో ఎంతో కఠినంగా ప్రవర్తించింది. అది కేవలం ఒక బొమ్మ మాత్రమే, ఇది కేవలం ఒక టాస్కు మాత్రమే అనే ధోరణిలో ఉంది. ఆ బొమ్మను ఊపడం, కింద పడేయడం, పట్టించుకోక పోవడం చేసింది. అందరూ అది చూసి ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రశ్నించినా సరిగ్గా స్పందించలేదు. కానీ, టాస్కు అయిపోయిన తర్వాత తన తప్పు తెలుసుకుని కుమిలిపోయింది.
“నాకు పిల్లల గురించి తెలియదు. నేను ఇప్పటివరకు ఒక్క పాపను కూడా ఎత్తుకోలేదు. నాకు ఎవ్వరూ తీసుకోమని ఇవ్వలేదు కూడా. అందుకేనేమో నేను అంత అటాచ్ అవ్వలేదు. ఇటీవలే మా అక్కకు పాప పుట్టింది. ఆమెను నేను ఎత్తుకోను కూడా లేదు. ఎందుకంటే నాకు అవన్నీ రావు. ఇక్కడ కూడా బేబీతో అటాచ్ కాలేదు. ఎంతో రూడ్‌గా ప్రవర్తించాను. ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఐ ఫీల్ షేమ్ ఆన్ మై సెల్ఫ్. మీరు చెప్తున్నవి వింటే నాకు ఏడుపు ఆగలేదు. నేను అలా చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అందుకే ఇక్కడికి వచ్చి చెప్తున్నాను” అంటూ వాసంతి కృష్ణన్ తను చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకుని క్షమాపణలు చెప్పింది. వాసంతి కృష్ణన్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.