టీవీ షోల్లో డిఫరెంట్ ట్రెండ్ సృష్టించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. పరిచయం లేని కొంతమంది వ్యక్తుల్ని, ఓ ఇంటిలో కొన్నిరోజులు పాటు ఉంచడం, వాళ్ల మధ్య గేమ్స్ పెట్టడం.. చివరగా ఒకరు విన్నర్ కావడం. ఈ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ తెలుగు షో ఆరో సీజన్ ప్రస్తుతం టీవీలో ప్రసారమవుతోంది. 21 మంది పార్టిసిపెంట్స్ హౌసులో ఉన్నారు. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి ప్రారంభ ఎపిసోడ్ కు ఘోరమైన రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్ లో ‘బిగ్ బ్రదర్’ షో చాలా ఏళ్ల క్రితం ప్రసారమై, అక్కడ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత ప్రపంచంలోని చాలా భాషల్లో దీనిని పోలిన షోలు వచ్చాయి. ఇక భారతదేశం విషయానికొస్తే.. ఫస్ట్ హిందీలో ‘బిగ్ బాస్’ పేరుతో ప్రారంభించారు. అక్కడి విపరీతమైన హిట్ అయింది. ఇప్పటివరకు 15 సీజన్లకు పైగా పూర్తయ్యాయి. త్వరలో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ తో 16వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇక దక్షిణాదిలోనూ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో ఓ ఐదు సీజన్లుగా బిగ్ బాస్ షో ప్రసారమవుతోంది.
తెలుగులో ఎన్టీఆర్ హోస్టుగా చేసిన తొలి సీజన్.. సూపర్ సక్సెస్ అయింది. ప్రారంభ ఎపిసోడ్ అయితే 16.18 రేటింగ్ వచ్చింది. నాని హోస్టుగా చేసిన రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05 రేటింగ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి నాగార్జున హోస్టుగా చేస్తున్నారు. మూడు, నాలుగు, ఐదు సీజన్ల ప్రారంభ ఎపిసోడ్లకు వరసగా 17.9, 18.5, 15.71 రేటింగ్స్ వచ్చాయి. కానీ ఈ మధ్య మొదలైన ఆరో సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ కి మాత్రం ఘోరమైన రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రేటింగ్ 8.86 మాత్రమే! ఇది చూసి నెటిజన్స్ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. మరి బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ రేటింగ్ తగ్గడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఎపిసోడ్కి రూ.55 లక్షలు! నాగార్జున రెమ్యూనరేషన్ లెక్కలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
#BiggBossTelugu 1st Episodes TRP Ratings
👉#BiggBossTelugu1 (#NTR) – 16.18
👉#BiggBossTelugu2 (#Nani) – 15.05
👉#BiggBossTelugu3 (#Nagarjuna) – 17.9
👉#BiggBossTelugu4 (#Nagarjuna) – 18.5
👉#BiggBossTelugu5 (#Nagarjuna) – 15.71
👉#BiggBossTelugu6 (#Nagarjuna) – 8.86*****— T2BLive.COM (@T2BLive) September 15, 2022