బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మరికొన్ని గంటల్లో ఈ తెలుగు బుల్లితెర రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే సభ్యులు అంతా రెడీ అయిపోయి ఇంట్లోకి వెళ్లేందుకు ఉవిళ్లూరుతున్నారు. ఇప్పటివరకు ఇంట్లోకి వెళ్లబోయేది వీళ్లే అంటూ చాలా పేర్లు బయట వైరల్ అవుతున్నాయి. వాటిలో సింగర్ రెవంత్, మోడల్ రాజశేఖర్ పేర్లు కన్ఫామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్లే స్వయంగా ఆ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వెల్లడించారు. తర్వాత మళ్లీ నాలుక కరిచి డిలీట్ చేశారులెండి. అయితే వాళ్లు ఫైనల్ సభ్యులని క్లారిటీ వచ్చేసింది. ఇంకా చాలానే పేర్లు అలా బయట చక్కర్లు కొడుతున్నాయి. ఫైనల్‌గా ఎవరు స్టేజ్ మీద ఉంటారు అనేది ఆదివారం క్లారిటీ వచ్చేస్తుంది.
బిగ్ బాస్ షోని సగం మంది కింగ్ నాగార్జన హోస్టింగ్ కోసం కూడా చూస్తుంటారు. నాగార్జున గత మూడు సీజన్లుగా షో ఎంతో చక్కగా నడిపిస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షో అంటే నాగార్జన లేకుండా ఊహించుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే నిర్వాహకులు సైతం నాగార్జునను వదులుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి సైతం హోస్ట్ గా నాగార్జునానే ఎంచుకున్నారు. బిగ్ బాస్‌ను సక్సెస్ చేసేందుకు నాగార్జున సైతం ఎంతో ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. అన్నీ ఎపిసోడ్లు చూస్తూ.. అందరితో చక్కగా మాట్లాడతారు. అంతేకాకుండా కొన్ని విషయాలను నిక్కచ్చిగా ముఖం మీదే చెప్పేస్తారు కూడా. అందుకే హోస్ట్ గా నాగార్జునానే కావాలని కోరుకుంటున్నారు.
నిజానికి బగ్ బాస్ నిర్వాహకుల నుంచి నాగార్జునకు గట్టిగానే పారితోషకం అందుతుంటుంది. ఈసారి ఆ లెక్క ఇంకాస్త పెరిగినట్లు తెలుస్తోంది. ఎంత అంటే మొత్తం వినగానే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఒక్కో ఎపిసోడ్ కోసం నాగార్జునకు దాదాపు రూ.55 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారంట. అంటే శనివారం, ఆదివారం వచ్చే రెండు ఎపిసోడ్లకు వారానికి రూ.1.10 కోట్లనమాట. అంటే మొత్తం 15 వారాలు, గ్రాండ్ ఫినాలే కలిపి నాగార్జునకు దాదాపు రూ.16.50 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందనుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒక రియాలిటీ షోకి హోస్ట్ కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే అవాక్కవ్వాల్సిదే.
ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరింత ఉత్కంఠగా ఉండబోతోందని చెబుతున్నారు. ఈ సీజన్లో హౌస్ మొత్తాన్ని కొత్తగా మార్చిన విషయం చూశాం. అయితే ఒక్క హౌస్ మాత్రమే మార్చారంటే మీరు పొరబడినట్లే. ఇక నుంచి రూల్స్, గేమ్స్, టాస్కుల విషయంలో సైతం గట్టి మార్పులే వస్తున్నాయంట. అటు నామినేషన్స్ రోజు కూడా మారిపోయినట్లు చెబుతున్నారు. అంటే సోమవరాం జరగాల్సిన నామినేషన్స్ ను బుధవారానికి మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా టాస్కులు కూడా మరింత టఫ్‌గా ఉండబోతున్నాయంటున్నారు. మరి నాగార్జున రెమ్యూనరేషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడియో: అసలు బెండపూడి పాఠశాలలో ఏం జరుగుతోంది?: