బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. షో రెండో వారంలో మరింత జోరు పెరిగింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో హౌస్ మొత్తం యుద్ధ భూమిలా మారిపోయింది. టాస్క్ మొదలైన మంగళవారం కంటే.. బుధవారం ఇంట్లోని సభ్యుల మధ్యపోటీ పెరిగింది. మొదటి కంటెండర్‌గా చంటీ గెలుపొందిన విషయం తెలిసిందే. రెండో కంటెండర్‌గా అయ్యేందుకు ఇంట్లోని సభ్యులు చాలానే కష్టపడ్డారు. మంగళవారం రాత్రి రెండోసారి ట్రామ్‌లో బొమ్మను పెట్టిన ఐదుగురికి మాత్రమే ఇప్పుడు రెండో రౌండ్‌లో అవకాశం కల్పించారు. మంగళవారం రాత్రి ట్రామ్‌లో అర్జున్ కల్యాణ్, ఫైమా, కీర్తీ భట్, ఇనయా సుల్తానా, ఆరోహీ రావు బొమ్మలను పెట్టారు. కాబట్టి వారిని సెలక్ట్ చేశారు.
రెండో కంటెండర్ అయ్యేందుకు ఫిజికల్ టాస్క్ పెట్టారు. అందులో అందరూ అర్జున్ కల్యాణ్ విజయం సాధిస్తాడని భావించారు. కానీ, అర్జన్ కల్యాణ్ ముందే తప్పుకున్నాడు. ఆ తర్వాత ఫైమా, ఆరోహీ రావులు కూడా గేమ్ లో నుంచి డిస్కాలిఫై అయ్యారు. ఆ తర్వాత ఫైట్ ఇనయా సుల్తానా, కీర్తీ భట్ ల మధ్య జరిగింది. కానీ, ఆ పోటీలో కీర్తీ భట్‌కు చిన్న ప్రమాదం జరిగింది. ఆమె అప్పటికే ఇనయాతో పోరాడి అలసిపోయింది. ఆ తర్వాత ఒక్కసారి వంగి లేచేందుకు ప్రయత్నించగా.. ఆమెకు పొట్ట దగ్గర మజిల్ పట్టేసింది. దాంతో పైకి లేవలేక అలాగే ఉండిపోయింది. తర్వాత కింద కూర్చొని నిదానంగా శ్వాసతీసుకునేందుకు ప్రయత్నించగా.. కాసేపటికి మజిల్ రిలీజ్ కావడంతో ఊపిరి పీల్చుకుంది.
ఇంట్లోని సభ్యులు అందరూ కీర్తీ భట్‌ని చూసి చాలా కంగారు పడిపోయారు. అయితే ఇనయాతో పోలిస్తే కీర్తీ భట్ కాస్త సన్నగా ఉంటుంది కాబట్టి ఆమెతో పోరాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఇలా ప్రమాదానికి గురైంది. తర్వాత ఇనయా సూల్తానాను రెండో కంటెండర్‌గా ఎంపిక చేశారు. మొదటి చంటి ఆ తర్వాత ఇనయా కెప్టెన్సీ పోటీదారులుగా అర్హత సాధించారు. వారి తర్వాత రాజశేఖర్, ఆర్జే సూర్య, గీతూ రాయల్ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే గీతూ ఎలా వచ్చింది అని అందరూ అనుకోవచ్చు. బెస్ట్ పర్ఫార్మర్ గా హౌస్ మొత్తం గీతూని ఎంపిక చేయడం వల్ల ఆమె కంటెండర్ గా మారింది. కీర్తీ భట్ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తేలియజేయండి.