బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. టాస్కులతో హౌస్ మొత్తం హోరెత్తిపోతోంది. బిగ్ బాస్ ఇచ్చిన కప్టెన్సీ టాస్కుతో హౌస్ మొత్తం నిద్ర లేకుండా నానా తిప్పలు పడుతున్నారు. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ సిసింద్రీ అనే టాస్కును పెట్టాడు. అందులో భాగంగా తలా ఒక బొమ్మను ఇచ్చారు. ఆ బొమ్మ వాళ్లకు కన్న బిడ్డలాగా చూసుకోవాలి. దాని అవసరాలు తీరుస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎవరైనా బొమ్మను ఒంటరిగా వదిలేస్తే వేరే వాళ్లు లాస్ట్ అండ్ ఫౌండ్ దగ్గర వేయచ్చు. అప్పుడు ఆ బొమ్మ ఎవరిదో వాళ్లు డిస్కాలిఫై అయిపోతారు. మొదటి రౌండ్‌లో కెప్టెన్సీ పోటీదారుడిగా చంటీ గెలుపొందాడు. గీతూ గేమ్ దెబ్బకు రేవంత్, శ్రీసత్య, అభినయశ్రీ గేమ్ నుంచి తప్పుకున్నారు. ఒక్కతే హస్ మొత్తాన్ని నానా తిప్పలు పెడుతోంది.
నిజంగా ఈ కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో గీతూ రాయల్ చిత్తూరు చీతా అని నిరూపించుకుంది. ఎందుకంటే ఆమె ఒక్కదాన్ని ఓడించడం కోసం హౌస్‌లోని సభ్యులు మొత్తం ఒక్కటై పోరాడుతున్నారు. టాస్కులో ఉన్న అన్ని రూల్స్ ని ఫాలో అవుతూ హౌస్‌లో ఉన్న అందరికీ చుక్కలు చూపిస్తోంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గీతూ మొత్తం ముగ్గురి బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేసింది. ఆ తర్వాత నిద్రపోయాక బాలాదిత్య బొమ్మను వేసింది. అయితే గీతూని ఓడించేందుకు, తమ బొమ్మలను కాపాడుకునేందుకు సభ్యులు మొత్తం ఒక గ్రూప్‌గా తయారయ్యారు. బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఆమె బొమ్మ ఎవరికి దొరికినా లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేసేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే గీతూని ఓడించడం అంత తేలిక కాదనే విషయం వారకి కాస్త ఆలస్యంగా తెలిసింది. ఎందుకంటే గీతూ రాయల్ ఆలోచనలను అందుకోవడం అంత సులభం కాదు. ఆ విషయం ఇంట్లోని సభ్యులకు సైతం తెలిసొచ్చింది. ఇల్లు మొత్తం గాలించిన తర్వాత తమ ఓటమిని ఒప్పుకుని గీతూని వాళ్లే పొగడ్తలతో ముంచెత్తారు. ఒక్క అమ్మాయి అందరినీ ఆడిస్తోంది అంటూ కామెంట్ చేశారు. ఇంక శ్రీ సత్య, అభినయశ్రీ అయితే ఫన్నీగా తమ గేమ్ చూసుకుని తమ ముఖం మీద తామే ఉమ్మేసుకున్నట్లు చేశారు. చివరికి చిత్తూరు చిరుతే గ్రేట్ అని వారి నోటితో వాళ్లే ఒప్పుకున్నారు. ఆమె స్ట్రాటజీని తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు అదే స్ట్రాటజీ అర్థంకాక నానా తిప్పలు పడుతున్నారు. గీతూ రాయల్ గేమ్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.