సింగర్ రేవంత్.. ఈ పేరు మొన్నమొన్నటి వరకు చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు మనోడు బిగ్ బాస్ లో అడుగుపెట్టేసరికి.. ఆ తెలియని వాళ్లకు కూడా రేవంత్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అసలు రేవంత్ ఎలా ఉంటాడు? టాస్కుల్లో ఎలా ఆడతాడు? లాంటి విషయాల గురించైనా సరే షో చూస్తున్నారు. ఇక ఎనిమిది రోజులుగా హౌసులో చలాకీగా ఉన్న రేవంత్.. తొమ్మిదిరోజు మాత్రం కుప్పకూలిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. అందులో రేవంత్ కూడా ఒకడు.
గతవారం కూడా రేవంత్ నామినేట్ అయ్యాడు. సో ఎలాగైనా సరే ఈసారి ఎలిమినేషన్ నుంచి బయటపడాలని గట్టిగా అనుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఈసారి బిగ్ బాస్ పెట్టిన బేబీ టాస్కులో ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు. ఇందులో భాగంగా హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బేబీ డాల్స్ ని ఇచ్చారు. ఇక బయట లాన్ ఏరియాలోని బేబీ రోల్ స్ట్రాలర్ లో తమ బొమ్మ పెట్టేందుకు పార్టిసిపెంట్స్ పరుగుతీశారు. రేవంత్ కూడా అందరికంటే ముందు ఉండాలని ప్రయత్నించాడు. బొమ్మని ఆ స్ట్రాలర్ లో ఉంచాడు కూడా. కానీ ఆ క్రమంలోనే గోడని ఢీ కొట్టి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత గీతూ, రేవంత్ బొమ్మ దొంగతనం చేసింది.
ఆ సమయంలో రేవంత్, మరో పార్టిసిపెంట్ నేహాతో గొడవపడ్డాడు. చివరకు తన బొమ్మ ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఏరియాలో దొరికింది. దీంతో ఆ బొమ్మని కాస్త స్టోర్ రూమ్ లో ఉంచమని బిగ్ బాస్ ఆదేశించాడు.అలా తన బేబీని అక్కడ ఉంచాల్సి వచ్చిందని రేవంత్ తెగ బాధపడ్డాడు. రాత్రి పక్కనపెట్టి పడుకుందామనుకున్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న రోహిత్-మెరీనా కంట్రోల్ చేస్తున్నా సరే రేవంత్ కంట్లో నుంచి నీరు వస్తూనే ఉన్నాయి. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రేవంత్ కాస్త ఏడ్చేసేసరికి ప్రేక్షకులు షాకవుతున్నారు. మరి రేవంత్ కుప్పకూలి కన్నీరుపెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: గీతూపై రేవంత్ ఫైర్.. ఆమెను అశుద్ధంతో పోలుస్తూ కామెంట్స్!