ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల హోమ్ టూర్స్ గురించి వింటున్నాం.. వీడియోలు చూస్తున్నాం. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లపాటు వెలుగు వెలిగిన చాలామంది సీనియర్ యాక్టర్ల ఇళ్లను చూశాం. అదేవిధంగా ప్రస్తుతం ఫామ్ లో ఉన్న నటీనటుల ఇళ్లను కూడా హోమ్ టూర్ వీడియోలలో చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా జబర్ధస్త్ ఫైమా ఇంటిని సుమన్ టీవీ హోమ్ టూర్ గా నిర్వహించింది. ఫైమా అమ్మ గారు సుమన్ టీవీ ఇంటర్య్వూ పాల్గొన్నారు. వారి కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.
ఫైమా గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. జబర్దస్త్ లో కూడా ఫైమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను ఫైమా క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు టెలివిజన్ వేదికపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-6 లో ఓ సభ్యురాలిగా వెళ్లింది. అయితే నిరుపేద కుటుంబం నుంచి ఓ సామాన్య అమ్మాయి.. జబర్ధస్త్, బిగ్బాస్ షో వరకు రావడం వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. తాజాగా ఫైమా ఇంటిని సుమన్ టీవీ హోమ్ టూర్ చేసింది. ఫైమా అమ్మ గారు తమ కుటుంబ గురించి అనేక విషయాలను వెల్లడించారు. మరి ఫైమా హోమ్ టూర్ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.