ఆ చిన్నారి.. ఇప్పుడు దక్షిణాదిలో విలక్షణ నటి. హీరోయిన్ గా చాలామంది పేరు తెచ్చుకుంది. గ్లామర్, డీ గ్లామర్.. ఎలాంటి పాత్ర అయినా సరే ఆమె రెడీ. కాకపోతే ఆమె ఎక్కువగా నేచురల్ గా ఉండే పాత్రల్లోనే మెరిసింది. యాక్టింగ్ తో పాటు నేచురల్ బ్యూటీతోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది. వాళ్ల ఫ్యామిలీలోనూ నటులున్నారండోయ్.. ఇకపోతే ఈమె తండ్రి కూడా హీరోగా పలు సినిమాలు చేశారు. ఇంతకీ ఆమె ఎవరంటే?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫొటోలో కనిపించిన చిన్నారి హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్. రాజేంద్రప్రసాద్ హీరోగా చేసిన ‘రాంబంటు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఐశ్వర్య.. 2010 నుంచి తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇక తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికైతే డ్రైవర్ జమున, ద గ్రేట్ ఇండియా కిచెన్, ధృవనక్షత్రం చిత్రాలు చేస్తోంది.
ఇక ఐశ్వర్యా రాజేశ్ తండ్రి రాజేశ్ కూడా నటుడే. 80ల్లో హీరోగా, రెండో హీరోగా, సహాయ నటుడిగా పలు సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఇక ఐశ్వర్యకి ఎనిమిదేళ్లున్నప్పుడు తండ్రి చనిపోయారు. ఆ తర్వాత రోడ్ యాక్సిడెంట్ లో ఇద్దరు సోదరులు కూడా మరణించారు. ఇక తెలుగులో ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి, కమెడియన్ గానూ మెప్పించిన శ్రీలక్ష్మి.. ఐశ్వర్యా రాజేశ్ కి అత్త. ఈ మధ్య ‘సుడాల్’ వెబ్ సిరీస్ లోనూ నటించిన ఐశ్వర్య.. తన నటనతో ఆశ్చర్యపరిచింది. మరి ఐశ్వర్యా రాజేశ్ చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో ఇంత విషాదం ఉందా..?