బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారంలోకి అడుగుపెడుతూనే హౌస్‌ని అదరగొట్టేశారు. ఆదివారం ఫన్‌డే ముగిసిన తర్వాత హౌస్‌లో సోమవారం అసలు రచ్చ మొదలవుతుంది. అదే నామినేషన్స్ డే అనమాట. ఆ రోజు హౌస్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ నానా యాగి చేస్తారు. నిజానికి మొదటి రెండు వారాల నామినేషన్స్ కంటే మూడోవారం నామినేషన్స్ అయితే యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నాగార్జున మర్చిపోకండి అని చెప్పిన మాటను ఎవరూ మర్చిపోలేదని అర్థమవుతోంది. ఎందుకంటే ఆ నామినేషన్స్ ప్రోమో చూస్తే అదే అర్థమవుతోంది. మూడోవారం నామినేషన్స్ లో 9 నుంచి 11 మంది ఉండే అవకాశం ఉంది. ఈ ప్రోమో చూసిన వాళ్లు తప్పకుండా ఎపిసోడ్ చూడాల్సిందే అన్నట్లుగా ఉంది.
నామినేషన్స్ లో ముఖ్యంగా గలాటా గీతూ, చలాకీ చంటీలకు మధ్య గట్టి గొడవ జరిగింది. నిజానికి వాళ్లిద్దరి మధ్య మొదటి రోజు నుంచి కూడా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ నామినేషన్స్ ప్రక్రియతో అది ఇంకాస్త ముదిరింది. గత వారం నామినేషన్స్ సమయంలో చంటి సంస్కారం అనే పదాన్ని ఉపయోగించాడు.. తర్వాత తాను అసలు ఆ పదమే అనలేదు అన్నాడు. అదేంటో ఇంట్లోని సభ్యులు కూడా సంస్కారం అనే పదం అనలేదు అంటూ చెప్పుకొచ్చారు. మరోసారి కూడా వీళ్లిద్దరి మధ్య అదే సంస్కారం టామిక్ మీద రచ్చ మొదలైంది. తోటివారికి సంస్కారం ఇవ్వాలంటూ చంటి.. వయసుని బట్టి రెస్పెక్ట్ ఇచ్చే టైప్ నేను కాదు అంటూ గీతూ రచ్చ రచ్చ చేశారు.
గీతూ మొదట చంటిని నామినేట్ చేసింది. ఆ సమయంలో మాట్లాడుతూ ఒక వ్యక్తి పెద్ద అనే విషయం మీద ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వను అంటూ చెప్పింది. చంటి గీతూని నామినేట్ చేస్తూ.. హౌస్‌లో 10 మందితో కలిసి ఉన్నప్పుడు పది మందితో కాస్త సంస్కారంగా బిహేవ్ చేయాలంటూ సూచించాడు. అందుకు గీతూ ముందు నీది కరెక్ట్ గా ఉందేమో చూసుకో.. తర్వాత నాతో మాట్లాడుదువూ అంటూ కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఆర్గుమెంట్ చేయబట్టే నేను ఆ మాట అన్నాను అంటూ చంటి చెప్పాడు. అందుకు గీతూ.. నాకేం తీటకాదు అందరితో ఆర్గుమెంట్లు పెట్టుకోవడానికి అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్‌తో హౌస్‌లో పెద్ద రచ్చే జరగబోతోందని అర్థమవుతోంది. నామినేషన్స్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.