లవ్ అంటే ఏంటి? అహ మనలో మన మాట. లవ్ అంటే ఏంటి? ప్రేమించిన వారిని మ్యూజిక్ సిస్టమ్ లా చూసుకుంటారు అవునా? అలాంటి మ్యూజిక్ సిస్టమ్ మీద వేరే ఎవరైనా చేయి వేస్తే టెంపర్ లూజ్ అవుతుందా లేదా? అవుతుంది, ప్రేమిస్తే పాయింట్ 1 పర్సెంట్ అయినా పొసెసివ్ నెస్ అనేది ఉంటుంది. పొసెసివ్ నెస్ లేకపోతే అదసలు ప్రేమే కాదు. “అబ్బే నేను బాగా ఓపెన్ మైండెడ్ అండి, నా మ్యూజిక్ సిస్టమ్ మీద ఎవరు చేయి వేసినా పర్లేదు, మాది ప్రేమే” అని అంటే సీటు బెల్ట్ లో బెల్ట్ తీసి మరీ తంతారు. ఈ లవ్ అనేది బ్లూ టూత్ కనెక్షన్ లాంటిది. ఒకరికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. వైఫైలా అందరికీ కనెక్ట్ అయితే దాన్ని లవ్ అనరు. దానికి సొసైటీ యాక్సెప్ట్ చేయని పదం ఒకటి ఉంది.
మేటర్ ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ ఎడిటర్లు చాలా కష్టపడి ప్రోమో కట్ చేశారు గానీ చిన్న డ్రమెటికల్ మిస్టేక్ జరిగిపోయింది. సమాజం యాక్సెప్ట్ చేయని డ్రామాకి ప్రేమదేశం బీజీఎమ్ పెట్టినట్టు.. ఆర్జే సూర్య, ఆరోహి రావుల మాటలకి లవ్ బీజీఎమ్ యాడ్ చేసి తప్పు చేశారు. ఆ బీజీఎమ్ కి తగ్గా లవ్ ట్రాక్ ఏం నడుస్తలేదక్కడ. అసలు దాన్ని లవ్వనే అనరు. లవ్ అంటే అది వేరే లెవల్. ఆర్జే సూర్య, ఆరోహి రావు ఎక్కడా తాము ప్రేమించుకుంటున్నామని ఓపెన్ అవ్వలేదు. అలా అని ప్రేమించుకోవట్లేదు అని అనడానికి కూడా వీల్లేదు. కాకపోతే ఈ ప్రేమకి బ్రాడ్ మైండ్ ఎక్కువ. షోలో ఆర్జే సూర్య, ఆరోహి రావు మధ్య చిన్న డిస్కషన్ నడుస్తుంది. “నాకు నచ్చలేదు, నచ్చలేదని చెప్తా. అంతే ఏముంది అందులో” అని ఆర్జే సూర్య అంటాడు.
దానికి ఆరోహి రావు “నాకు కూడా నచ్చలేదు” అని అంటుంది. సరే చెప్పు మార్చుకుంటా అని ఆర్జే సూర్య అంటాడు. “నేను మానేయమని చెప్పినా నువ్వు మానవని నాకు తెలుసు” అని ఆరోహి రావు అంటుంది. “నేనొకరితో క్లోజ్ గా ఉంటున్నాను, అదే కదా నీ కంప్లైంట్” అని ఆర్జే సూర్య అనగా.. “అవును అదే” అని ఆరోహీ రావు అంటోంది. “అయితే నాకు కూడా సేమ్ ఉన్నాయి. నేనేం చెప్పను. మానేయమని చెప్పనా” అని ఆర్జే సూర్య అంటాడు. “నువ్వు ఇద్దరితో కనెక్ట్ అయ్యావ్, నేను నలుగురితో కనెక్ట్ అయ్యాను అంతే తేడా” అనగానే ఆరోహి రావు లేచి వెళ్ళిపోతుంది.
ఈ డిస్కషన్ లో ఇద్దరి మాటలు వింటే.. ఆరోహి రావు హౌస్ లోని మగాళ్లతో క్లోజ్ గా ఉండడం ఆర్జే సూర్యకి నచ్చడం లేదు. అలానే ఆర్జే సూర్య హౌస్ లోని అమ్మాయిలతో క్లోజ్ గా ఉండడం ఆరోహి రావుకి నచ్చడం లేదన్న విషయం స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ ఆర్జే సూర్యకి.. ఆరోహి విషయంలో ఎక్కువ పొసెసివ్ నెస్ లేదనిపిస్తుంది. గేమ్ లో భాగమే కదా అని ఓపిక పడుతున్నాడు. కానీ తనను క్వశ్చన్ చేస్తే మాత్రం ఆరోహి రావు మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. దీన్ని ప్రేమనాలా? లేక బూతు అనాలా? ప్రేమతో కూడిన బరితెగింపు వల్ల వచ్చిన బూతు అనాలా? బిగ్ బాస్ షో చూసేది ఎక్కువగా సాధారణ జనమే. వారికి ఈ అల్ట్రా మోడ్రన్ కంటెంట్ ఎక్కదు. ఈ విషయంలో ఎడిటర్ గారు డ్రమెటికల్ మిస్టేక్ చేసేశారు. డ్రామా రక్తికట్టలేదమ్మ.
ఇది ఎలా ఉందంటే.. ఆది సినిమాలో ప్రేమించడం లేదని జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ కి లవ్ లెటర్ రాస్తాడు. హీరోయిన్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తే.. ఎల్బీ శ్రీరామ్ ఒక డైలాగ్ చెప్తాడు. ‘ఆది ఏం చెప్పాడో ఒక్క ముక్క అర్ధమవ్వలేదు. ప్రేమిస్తున్నాడో, ప్రేమించట్లేదో అర్ధమైతే ఆక్షనో, యాక్షనో తీసుకుంటాను’ అని అంటాడు. అలా ఈ షోలో ఆర్జే సూర్య, ఆరోహి రావు మధ్య జరిగే ట్రాక్ ని లవ్ అనలేము. అలా అని బూతు అనకుండా ఉండలేము. మరి బిగ్ బాస్ కి ఇది లవ్ అని ఎలా అనిపించిందో, ఏ యాంగిల్ లో లవ్ కనబడిందో?
అయితే లాస్ట్ లో ఆర్జే సూర్య ఒక మాట అన్నాడు, ఫోకస్ గేమ్ మీద ఫోకస్ అని. ఫోకస్ మాట బిగ్ బాస్ ఎరుగు, ఈ సొసైటీ అన్ యాక్సెప్టెడ్ లవ్ ట్రాక్ వల్ల షో ఫసక్ అయ్యిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాన్ని రాబట్టాలి కాబట్టి ప్రోమోలో వీరి డిస్కషన్ కి ఎమోషన్ యాడ్ చేశారు. కానీ నిజానికి ఇది ఎలా ఉందంటే మసాలా కంటెంట్ కి మోటివేషనల్ మ్యూజిక్ యాడ్ చేసినట్టుంది. అస్సలు సెట్ అవ్వలేదు. మీరు చెప్పండి బాస్.. మీ బ్లూ టూత్ కనెక్షన్ మీకు మాత్రమే కనెక్ట్ అవ్వాలా? లేక ఎవరికి పడితే వారికి కనెక్ట్ అవ్వాలా? మరీ అల్ట్రా మోడ్రన్ ఆర్టిస్ట్ లమైతే కాదు కదా. రియల్ లైఫ్ ఆర్టిస్టులం. దీన్ని ప్రేమ అంటారా? లేక బూతు అంటారా?