బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ రియాలిటీ షోకి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ ఉంది. ఈ షోకి వెళ్లి వచ్చిన వాళ్లు ఎంతో మంది సెకెండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ రాణిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా స్టార్లుగా వెళ్లి సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఈ షోకి ఎంత ఫాలోయింగ్ ఉందో.. అంతే నెగెటివిటీ కూడా ఉంది. బయట ఈ షోని వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. అయితే వారందరిలో సీపీఐ నారాయణ ముందుంటారు. గత 5 సీజన్ల నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం అయితే నారాయణ ఘాటువ్యాఖ్యలతో రెచ్చిపోతారు. ఇప్పటికే బ్రోతల్ హౌస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ షోని బ్యాన్ చేయాలని అందుకు ప్రజలే ముందుకు రావాలంటూ పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే.
సీపీఐ నారాయణ చేసే వ్యాఖ్యలపై ఎప్పుడూ బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున నేరుగా స్పందించింది లేదు. కానీ, ఇటీవలే నాగార్జున ఒక కౌంటర్ వేశారు. అది సీపీఐ నారాయణ కోసమే అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. అదేంటంటే.. ఈసారి షోలో మరీనా- రోహిత్ అనే రియల్ కపుల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కెమెరాలు ఉన్నాయని, ప్రేక్షకులు చూస్తున్నారని రోహిత్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. కనీసం ఆమెతో ప్రేమగా కూడా మాట్లాడటం లేదు. ఇవన్నీ మనం అనుకున్నవి కాదు. నేరుగా మరీనానే ఇంట్లోని అమ్మాయిలకు స్వయంగా చెప్పిన మాటలు. అది చూసిన నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో రోహిత్ కు మరీనాకు టైట్ హగ్ ఇవ్వాలని ఆర్డర్ వేశాడు. ఆ సమయంలో నారాయణ.. నారాయణ.. వాళ్లు మ్యారీడ్ అంటూ కామెంట్ చేశాడు.
ఆ కామెంట్ సీపీఐ నారాయణ కోసమే అని ప్రేక్షకులు భావించినట్లే ఆయన కూడా అనుకున్నారు. అందుకే నాగార్జున చేసిన వ్యాఖ్యకు కౌంటర్ గా వీడియో విడుదల చేశారు. “నాగన్నా.. నాగన్నా.. ఈ బిగ్ బాస్ షోలో పైళ్లైన వాళ్లకే లైసెన్స్ ఇచ్చారు, శోభనం గది ఏర్పాటు చేశారు. మరి పెళ్లికాని వాళ్ల పరిస్థితి ఏంటన్నా? వాళ్లు బంధువులు కాదు కదా? మరి.. వాళ్ల సంగతి ఏంటన్నా?” అంటూ సీపీఐ నేత నారాయణ నాగార్జునను ప్రశ్నించారు. నాగన్నా నాగన్నా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. నారాయణ వ్యాఖ్యలపై గత సీజన్లలో పాల్గొన్న సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నచ్చకపోతే చూడటం మానేయండి అంతే కానీ ఇలాంటి మాటలు దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. సీపీఐ నారాయణ- నాగార్జున మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.