ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీంఇండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. వన్డే సిరీస్ తో మెుదలు పెట్టిన విజయ పరంపర టీ20ల్లో సైతం చూపిస్తూనే ఉంది. తాజాగా జరిగిన తొలి టీ20లో జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. టీం లోని ఆటగాళ్లంత సమష్టిగా రాణించారు. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ అవుట్ అయిన విధానం అతని నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఇన్నింగ్ 10వ ఓవర్లో రిషభ్ పంత్ అవుట్ అయ్యాడు. విండీస్ బౌలర్ కీమో పాల్ బాల్ ను హాఫ్ సైడ్ దిశగా కాస్త వికెట్లకు దూరంగా సంధించాడు. దాన్ని పంత్ ఆన్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అయ్యి బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఉన్నమెక్కాయ్ దాన్ని అందుకున్నాడు. దాంతో 12 బంతుల్లో 14 పరుగులు చేసిన పంత్ వెనుదిరగాల్సి వచ్చింది. పంత్ అవుట్ అయిన విధానం కెప్టెన్ రోహిత్ శర్మకు చిరాకు తెప్పించింది. తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. ''షాట్ ఎలా ఆడాలనుకున్నావ్.. ఎలా ఆడావ్.. దాన్ని ఆఫ్ సైడ్ ఆడాలి'' అనే అర్థం వచ్చేలా రోహిత్ శర్మ చేతులు ఊపడం కనిపించింది. దాంతో రోహిత్ పంత్ ను మనసులో ఎన్ని తిట్టుకున్నాడో అంటూ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా భారత్ 5 టీ20లను ఆడాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 68 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 64 రన్స్ చేయగా, దినేష్ కార్తీక్ తన తుపాన్ ఇన్నింగ్స్ తో కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో కరేబియన్ వీరులు తడబడ్డారు. 20 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయగలిగారు. మరి పంత్ అవుటైన విధానం, రోహిత్ శర్మ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. India losing wickets in quick succession as @RishabhPant17 and @hardikpandya7 departs without ticking the score board much. Watch the India tour of West Indies LIVE, only on #FanCode https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/6H850WDdIT — FanCode (@FanCode) July 29, 2022 ఇదీ చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్కు సిల్వర్! ఇదీ చదవండి: 12 నెలలు.. 9 మంది ఓపెనర్లు! ఎంతకాలం ఈ ప్రయోగాలు?