క్రికెట్ లో మ్యాచ్ గెలవాలి అంటే అందరు సమష్టిగా రాణించాలి. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు విలువైన భాగస్వామ్యాలు అందించాలి. అప్పుడే ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమైన ఓపెనింగ్ జోడీ ఏదంటే వెంటనే సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ అంటారు. అలాంటి భారత క్రికెట్ ను ప్రస్తుతం ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. ఒక్క సంవత్సరంలోనే జట్టు ఎంత మంది జోడీలను మార్చిందో తెలుసా? లేదా కోచ్ ద్రవిడే అలా ప్రయోగాలు చేయిస్తున్నాడా? లాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి.. ప్రస్తుతం భారత క్రికెట్ కు మంచి రోజులు నడుస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. దాంతో జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. అయినప్పటికీ టీంఇండియాను ఓ సమస్య వేధిస్తోంది. కానీ ఆ సమస్య విజయాలపై ఏమాత్రం ప్రభావం చూపించక పోవడం గమనార్హం. ఇంకో రెండు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాను ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. సాధారణంగా టీ20ల్లో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడీ ఇన్నింగ్‌ను ఆరంభిస్తుంటుంది. కానీ గాయం కారణంగా కేఎల్ రాహుల్ వరుస సిరీస్ లకు దూరం అయ్యాడు. ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు బ్యాట్ పట్టలేదు. దీంతో రోహిత్ కు జోడీని కుదర్చడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. తాజాగా విండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు రోహిత్ కు జోడిగా తొలి మ్యాచ్ లో డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ ను దింపారు. కోచ్ ద్రవిడ్ ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అదంత మంచి పద్దతి కాదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఓపెనింగ్ జోడీని మార్చడం టీంఇండియాకు ఇది కొత్తేమీ కాదు. ఈ 12 నెలల కాలంలో ఏకంగా తొమ్మిది మందిని ఓపెనర్లుగా బరిలోకి దించింది. ఓపెనర్ల వరుస క్రమం చూస్తే.. రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్, సంజు శాంసన్-రోహిత్ శర్మ, దీపక్ హుడా-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-రిషభ్ పంత్ లు ఇన్నింగ్స్ లను ఆరంభించిన మ్యాచ్‌లు ఉన్నాయి. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మకు జత కట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎదుర్కొంటున్న ఓపెనింగ్ సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: IND vs WI: టాస్ టైమ్‌లో రోహిత్, పూరన్ మధ్య ఆసక్తికర సంభాషణ! రోహిత్ రియాక్షన్స్ వైరల్ ఇదీ చదవండి: వీడియో: తొలి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన కైల్కు ఎపిక్ రిప్లే ఇచ్చిన అర్షదీప్!