పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. ఈ డైలాగ్ ప్రేక్షకుల చెవిన పడి ఇప్పటికి దాదాపు 7 నెలలు కావస్తోంది. కానీ, పుష్ప సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌత్, నార్త్, తెలుగు, హిందీ ఇలా ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా పుష్పరాజ్ క్రేజ్ ఖండాంతరాలు కూడా దాటేసింది. సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు దాకా ఆ ఫీవర్ పాకింది. చివరికి రాజకీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు. ఇటీవల ఓ నేపాల్ మహిళా క్రికెటర్ సీతా రానా వికెట్ తీసి పుష్ప స్టైల్ లో సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా పుష్ప క్రేజ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) దాకా పాకింది. రింగ్ లో రెజ్లర్ పుష్ప మేనరిజంతో హల్చల్ చేశాడు. ప్రముఖ రెజ్లర్ సౌరవ్ గుజ్లర్ WWEలో పుష్ప మేనియాతో రచ్చ చేశాడు. ప్రత్యర్థిని ఎత్తి పడేసి.. తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చూపించాడు. ప్రస్తుతం సౌరవ్ గుజ్లర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ్ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా అల్లుఅర్జున్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. BhAAi Range eh veeru @AlluArjun #ThaggedheLe Mannerism By @Sanga_WWE #Pushpa #PushpaTheRule #WWE pic.twitter.com/LfXUfCLYJz — JAgAdeesh (@AlluJagadeesh17) June 30, 2022 మరోవైపు కింగ్ కోహ్లీ మరోసారి పుష్ప మేనరిజంతో సందడి చేశాడు. ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్ లో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేశాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి కోహ్లీ సందడి చేశాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోహ్లీ వీడియో షేర్ చేస్తూ.. కోహ్లీ ఇప్పటికీ ఇది నాలుగోసారి ఇలా చేయడం అంటూ ఆనందపడుతున్నారు. WWEలో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. It's Kohli's 4th time#PushpaTheRule @AlluArjun pic.twitter.com/voKZXDraJf — Allu Arjun TFC™ (@AlluArjunTFC) July 1, 2022 ఇదీ చదవండి: తెలుగు హీరోలపై బాలీవుడ్ ఆడియెన్స్ ట్రోల్స్! కారణం? ఇదీ చదవండి: అనసూయ స్థానంలో జబర్దస్త్ కి రావడానికి శ్రీముఖి ఒప్పుకోలేదా?