జబర్దస్త్ అనే కామెడీ షోకి బుల్లితెరలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ షో నుంచి ఏంతో మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. జబర్దస్త్ షో నుంచి టాలీవుడ్లో కమెడియన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వీళ్లు ఈ షోతో పాటుగా స్పెషల్ ఈవెంట్స్, స్కిట్లు కూడా చేస్తుంటారు. ఏ పండగ వచ్చినా.. స్పెషల్ డేస్ ఉన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే వినాయకచవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే కార్యక్రమం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ టీవీ యాంకర్ రోషన్ సందడి చేశారు. ప్రోమో మొత్తంలో యాంకర్ రోషన్ పార్ట్ హైలెట్‌గా నిలిచింది. ఈ స్పెషల్ ఈవెంట్ స్టేజ్ మీద అక్కడున్న కమెడియన్లను యాంకర్ రోషన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ సెగ్మెంట్ ఎంతో సరదా సరదాగా సాగింది. హైపర్ ఆదిని, స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ను రోషన్ ఇంటర్వ్యూ చేశారు. యాంకర్ ప్రశ్నలకు కృష్ణభగవాన్ తనదైన శైలిలో పంచ్‌లు, సమాధానాలు చెప్పారు. అక్కడి దాకా అంతా బాగానే ఉంది. తర్వాత గెటప్ శ్రీను వచ్చి యాంకర్ రోషన్‌కు ప్రశ్నలు సంధించడంతో వాతావరణం అంతా సీరియస్ అయిపోయింది. అయితే అది షోలో భాగంగా అలా ప్లాన్ చేశారా? లేక నిజంగానే గెటప్ శ్రీను- రోషన్ ఇంటర్వ్యూ పార్ట్ అంత సీరియస్‌గా సాగిందా? అనేది మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చాకే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న మన ఊరి దేవుడు ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి రోడ్డున పడ్డ బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే.. ఇదీ చదవండి: వీడియో: దుబాయ్‌లో రామ్ చరణ్ అభిమానుల సందడి..!