రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అనే బ్రాండ్ ఇమేజ్ ని కాకుండా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని పిలిచే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే దాకా ఎదిగాడు. ఇవి స్టేజ్‌పై స్వంయంగా చిరంజీవే చెప్పిన మాటలు.. రామ్ చరణ్‌కి తండ్రి అయినందుకు గర్వపడుతున్నా అంటూ చిరంజీవి వ్యాఖ్యానిచడం చూశాం. చిరుత అనే సినిమాలో చిరంజీవి కుమారుడిగా పరిచయం అయ్యి.. ఇప్పుడు ట్రిపులార్ అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే రామ్ చరణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఎంతో పెద్దది అనే చెప్పాలి. ట్రిపులార్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్‌కు చేరిందనే చెప్పాలి. హాలీవుడ్ డైరెక్టర్లు, ప్రేక్షకులు సైతం రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ గా మారారు. అయితే రామ్ చరణ్ క్రేజ్‌ని తెలియజెప్పే విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాక్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ స్టేడియంలో రామ్ చరణ్ అభిమానులు సందడి చేశారు. రామ్ చరణ్ మీసం తిప్పుతున్న ఫొటోని పట్టుకుని ఓ అభిమాని సందడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #ManOfMassesRamCharan for a Reason, His Euphoria @AlwaysRamCharan Craze at Dubai International cricket stadium, Yesterday 's #INDvsPAK Match #RamCharan #MegaPowerStar #JaiCHARAN pic.twitter.com/knfgNrg6eu — SivaCherry (@sivacherry9) August 29, 2022 ఇదీ చదవండి: బాబర్ ఆజమ్.. ఆ ఒక్క తప్పు చేయకుంటే పాకిస్థాన్ గెలిచేది: వసీం అక్రమ్ ఇదీ చదవండి: అంతా హార్దిక్ పాండ్యాని పొగుడుతున్నారు. కానీ.., అసలు హీరో కోహ్లీనే!