కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో జూన్ 9న అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. నయన్-విఘ్నేశ్ వివాహానికి సినిమా ఇండస్ట్రీలోనే ఎందరో ప్రముఖులు, సూపర్ స్టార్లు హాజరయ్యారు. ప్రస్తుతం నయన్- విఘ్నేశ్ దంపతులు థాయ్‌లాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. నయనతార తన సోషల్ మీడియా ఖాతాల్లో విఘ్నేశ్ తో కలిసున్న ఫొటోలను షేర్ చేసింది. ‘నీ తోడు దొరకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా.. హార్ట్ సింబల్స్ పెట్టుకొచ్చింది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. నయనతార లీడ్ రోల్ లో నటించిన O2 సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో జూన్ 17న విడుదలైంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నయనతార మొత్తం 5 సినిమాల్లో నటిస్తోంది. గోల్డ్ అనే మలయాళం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో ఇరైవాన్, కనెక్ట్ అనే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. హిందీలో జవాన్ సినిమాలో నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. నయన్-విఘ్నేశ్ వెకేషన్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #WikkiNayan Just Bliss pic.twitter.com/ZUkaDAjchZ — Nayanthara✨ (@NayantharaU) June 20, 2022 #vacation #Thailand #WikkiClicks pic.twitter.com/Y2cByV4T6g — Nayanthara✨ (@NayantharaU) June 20, 2022 HUSBAND & WIFE #WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/EjNQU6Krla — Nayanthara✨ (@NayantharaU) June 9, 2022 JUNE 09 ❤️ #WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/wc5UzO8OHi — Nayanthara✨ (@NayantharaU) June 9, 2022 ఇదీ చదవండి: యాంకర్ అనసూయ హాట్ డ్యాన్స్! వీడియో వైరల్! ఇదీ చదవండి: మేజర్ హీరోయిన్‌తో ప్రేమలో అక్కినేని నాగచైతన్య?