అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. తెలుగు టాప్ యాంకర్స్ లో ఒకరిగా వెలుగొందుతోంది అనసూయ. తన అందంతో అభినయంతో హీరోయిన్స్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన నటనతో సత్తా చాటుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే, అందంతో అభిమానుల మనసులు దోచుకుంటోంది. ముప్పై పదుల వయస్సులో కూడా తన అందంతో కుర్రకారు మనసులను దోచేస్తుంది ఈ అమ్మడు. అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా ఓ షో కోసం ఆఫ్ స్క్రీన్ లో చేసిన ఓ డ్యాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పొట్టి డ్రెస్ లో ఆమె చేసిన డ్యాన్స్ అభిమానులకు చెమటలు పట్టేలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ప్రతి వారం టీవీ షోస్ కోసం చేసే ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అందంతో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అనసూయ ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. తన అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా అనసూయ మరొకసారి తన డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఓ షో కి సంబంధించి డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న పోస్ట్ ఒకటి అనసూయ పెట్టింది. అందులో కేవలం వీడియో తో మాత్రమే ఉంది. తన అదిరిపోయే డ్యాన్స్ పెట్టిన అనసూయ.. 'గెస్ ది సాంగ్' అంటూ నెటిజన్లకు ప్రశ్నసందించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్స్ ఈ డాన్స్ వీడియో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న అనసూయ డ్యాన్స్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #anasuyabharadwaj pic.twitter.com/XKYPYDOhNf — Hardin (@hardintessa143) June 20, 2022