కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా విడుదలై 48 రోజులు కావొస్తున్నా ఆ మూవీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా, సినీ వర్గాలు, ప్రేక్షకుల్లో ఇంకా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ డైరెక్టర్ గా, రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఒక్క డైరెక్టర్, హీరో మాత్రమే కాదు.. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెన్నీషియన్ కి ఎంతో మంచి గుర్తింపు లభించింది. పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ కు సరైన ఉదాహరణ ఈ సినిమా అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా స్టామినా ఏంటో తెలిపే సంఘటన ఒకటి ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్స్ రోజు జరిగింది.
అదేంటంటే.. ఐపీఎల్ 2022 ఫైనల్స్ రోజు అహ్మదాబాద్ స్టేడియంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 రాకీ భాయ్ ఎంట్రీ సీన్ బీజీఎం ప్లే చేశారు. ఒక్కసారిగా అక్కడున్న 1,04,859 మంది ఆడియన్స్ ఒక్కసారిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశారు. ఆ దృశ్యం చూసిన ప్రతిఒక్కరికి కేజీఎఫ్ సినిమా స్టామినా ఏంటో అర్థమైపోతుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేజీఎఫ్, కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాతో ప్రశాంత్ నీల్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.
The feeling of absolute thrill, Goosebumps and massive entertainment.
Only one winner – Indian Cinema!#KGFChapter2 @RaviBasrur #KGFChapter2BGM 🎵🎶 pic.twitter.com/Cl8nxg6nk5— #KGFChapter2 – Box Office Monster 🔥 (@KGFTheFilm) May 31, 2022
ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాకి ఇచ్చిన ఎలివేషన్స్ కు మించి ఈ సినిమాలో ఉంటాయంటూ క్రూ ఇస్తున్న లీకులతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. అంతేకాకుండా ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్ 2 క్రేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ಹೆಮ್ಮೆಯ ಕ್ಷಣ PROUD MOMENT 🙏#IPL2022 #KGFChapter2#ನಮ್ಮHombale #ನಮ್ಮRCB@RCBTweets @hombalefilms
@TheNameIsYash @prashanth_neel @VKiragandur @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @HombaleGroup @bhuvangowda84 @RaviBasrur @ChaluveG— #KGFChapter2 – Box Office Monster 🔥 (@KGFTheFilm) May 29, 2022