వినాయక చవితి వచ్చిందంటే ప్రతీ ఒక్కరూ ఇంట్లో, ఆఫీసుల్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. గీతా ఆర్ట్స్ వారు కూడా తమ ఆఫీస్ లో వినాయకుడ్ని ప్రతిష్టించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రూపులు వారీగా భక్తులు గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ వారు కూడా తమ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు బయలుదేరారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి పాల్గొనడం విశేషం. వ్యాన్ లో గణపతిని ఊరేగిస్తూ ఉండగా.. అల్లు అర్జున్ వెనకనే కారులో ఫాలో అయ్యారు. కొంచెం దూరం వచ్చాక కారు దిగి వినాయక చవితి రోజున ఇంట్లో పెట్టిన గణపతి బొమ్మని తీసుకొచ్చి పెద్ద గణపతి దగ్గర పెట్టించారు. అనంతరం భక్తులతో కలిసి గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. తన కూతురుని ఎత్తుకుని భక్తుల మధ్య సందడి చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ బ్లాక్ డ్రస్ లో, కళ్ళజోడు పెట్టుకుని, మెడలో కండువా కప్పుకుని చాలా స్టైలిష్ గా ఉన్నారు. అల్లు అర్జున్ ఇలా ఒక్కసారిగా గణేష్ నిమజ్జనంలో కనబడేసరికి అక్కడున్న వారితో పాటు వీడియో చూసే వారికి కూడా పూనకాలు వచ్చేసాయి. మరి గణేష్ నిమజ్జనంలో కూతురు అర్హతో కలిసి సందడి చేసిన అల్లు అర్జున్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: LV Revanth: తండ్రి కాబోతున్న సింగర్ రేవంత్.. భార్యను తలచుకొని ఎమోషనల్! ఇది కూడా చదవండి: Dhanraj: సంపూర్ణేష్ బాబు కోసం తారక్ అన్న చాలా ఫైట్ చేశాడు: ధనరాజ్