ఇండస్ట్రీలో సెలబ్రిటీల నుండి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అది సినీతారలైనా, బుల్లితెర స్టార్స్ అయినా.. ఫ్యాన్స్ కి కావాల్సింది తమ అభిమాన సెలబ్రిటీ లైఫ్ గురించి మాత్రమే. అయితే.. సినిమాల నుండి బుల్లితెర వరకూ అందరికీ తెలిసిన వారిలో సింగర్ రేవంత్ ఒకరు. తెలుగువాడైన రేవంత్ చిన్నప్పటి నుండి సంగీతంలో ఇంటరెస్ట్ తో సింగింగ్ లో అడుగుపెట్టాడు. కెరీర్ పరంగా ఎన్నో గొప్ప అచీవ్ మెంట్స్ సాధించిన రేవంత్.. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా అద్భుతమైన పాటలు పాడాడు. ఇక సింగర్ గా ఇండియన్ ఐడల్ 9వ సీజన్ టైటిల్ కూడా గెలిచి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం కిందటే తన బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి అన్విత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నుండి ఫ్యామిలీ, కెరీర్ ఈ రెండింటిపైనే ఫోకస్ పెట్టిన రేవంత్.. ఇప్పుడు తాను సాధించాల్సిన టార్గెట్స్ లో 'బిగ్ బాస్ సీజన్ 6' టైటిల్ ని చేర్చుకున్నాడు. షోలోకి ఎంటర్ అవ్వకముందే టైటిల్ తో తిరిగొస్తానని చెప్పిన రేవంత్.. సెప్టెంబర్ 4న బిగ్ బాస్ హౌస్ లో సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. రేవంత్ కి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. త్వరలోనే సింగర్ రేవంత్ కాస్త ఫాదర్ రేవంత్ కాబోతున్నాడు. అవునండి.. సింగర్ రేవంత్, అన్విత దంపతులు త్వరలోనే ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భార్య అన్వితతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకునే రేవంత్.. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టగానే భార్యను తలచుకొని ఎమోషనల్ అయిపోయాడు. ఇక రేవంత్ భార్య అన్విత ప్రస్తుతం ఆరు నెలల గర్భణి అని సమాచారం. కాగా అన్విత కూడా షోలో కనిపించి భర్తకు బెస్ట్ విషెస్ తెలిపింది. ఇక త్వరలో పేరెంట్స్ కాబోతున్న ఈ జంటకు ఫ్యాన్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి రేవంత్ దంపతుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by (@anvitha_gangaraju) View this post on Instagram A post shared by (@anvitha_gangaraju) View this post on Instagram A post shared by Singer Revanth (@singerrevanth)