బిగ్ బాస్.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్స్ మొత్తం ఈ షో మేనియాలో ఉన్నారు. బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఇండియాలో స్టార్ట్ అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఐదు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజన్ 6 నడుస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ షోలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం 21 మంది సభ్యులను ఒకేసారి హౌస్లోకి పంపారు. అంతేకాకుండా కొన్ని భిన్నమైన టాస్కులు సైతం ఇవ్వనున్నారు. ఇప్పటికే క్లాస్, మాస్, ట్రాష్ అని 3 తరగతులుగా విభజించి హౌస్లో రచ్చ లేపారు. తొలి టాస్కుతోనే ఇంట్లో రచ్చ మొదలై పోయింది. సభ్యులు మొత్తం మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. అయితే ఎన్ని సీజన్లు వచ్చినా కూడా.. బిగ్ బాస్ లో మొదటి సీజన్ అందరి ఫేవరెట్ అనే చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ సీజన్ హోస్ట్ చేయడమనే చెప్పాలి. తారక్ హోస్ట్ చేసిన విధానం, సమస్యలపై స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇంట్లోని సభ్యులను సైతం పొగిడే దగ్గర పొగడటం, మందలించాల్సిన సమయంలో మందలించడం చేశాడు. తన మాట, ఆట, పాటతో జూనియర్ ఎన్టీఆర్ ఆ సీజన్ మొత్తాన్ని సూపర్ డూపర్ హిట్గా నిలిపాటు. అంతేకాకుండా తారక్ ఇంట్లోని సభ్యులకు ఎంతో మద్దతుగా నిలిచేవాడు. అందుకు ఒక మంచి ఉదాహరణను ఆ సీజన్ సభ్యుడిగా ఉన్న ధన్రాజ్ వెల్లడించాడు. “తారక్ అన్న వస్తే మాకొక హ్యాపీనెస్ అనమాట. మనల్ని ఏదైనా విషయంలో ఒక మాట అంటే తారక్ వస్తే చెప్తాడు అని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఒకళ్లు మనల్ని ఏదైనా అంటే తర్వాత తారక్ అన్న వచ్చి ఇది తప్పు అలా చేయకూడదు, అలా అనకూడదు అంటూ చెప్పేవాడు. ఆయన ఎంతో సపోర్ట్ గా నిలిచేవాడు. సంపూర్ణేష్ బాబు కోసం తారక్ అన్న ఎంతో ఫైట్ చేశాడు. సంపూ అలాంటి హౌస్లో ఉండలేడు. అతను పెరిగివచ్చిన వాతావరణం అది కాదు. కొద్దిరోజులకే సిక్ అయిపోయాడు. బయటకు వెళ్లాలంటే రూ.25 లక్షలు కట్టాలని చెప్పారు. అప్పుడు తారక్ అన్న ఫైట్ చేశాడు. నేను చేస్తున్న ఫస్ట్ షోలో ఇలా చేయద్దు. అతడ్ని పంపేయండి. అంతగా కట్టాలంటే ఆ రూ.25 లక్షలు నేను కడతాను అన్నాడు” అంటూ ధన్ రాజ్ అప్పుడు జరిగిన ఒక విషయాన్ని వెల్లడించాడు. తారక్ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: బిగ్ బాస్ లో అప్పుడే గొడవ.. గీతూ-ఇనయా ఒకరిపై ఒకరు..! ఇదీ చదవండి: మళ్లీ బిగ్ బాస్ షోపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నారాయణ.. బూతుల స్వర్గం అంటూ..!