ఒకప్పుడు కారు అనేది లగ్జరీ విభాగంలో ఉండేది. కానీ, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అది అవసరంగా మారిపోయింది. ఈ కార్లలో మాన్యువల్, ఆటోమేటిక్ అని రెండు రకాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. మాన్యూవల్ కన్నా డ్రైవింగ్ విషయంలో ఆటోమేటిక్ చాలా సులువుగా ఉంటుంది. అందుకే చాలా మంది ఆటోమేటిక్ కార్ కొనేందుకే ఇష్టపడుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఆ ఉద్దేశాన్ని మార్చుకుంటారేమో? తన కారు బ్రేక్ డౌన్ అయ్యిందని ఆ వ్యక్తి ఏదో రిపేర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ కారు నేరుగా అతని మీదకు దూసుకొచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు అయితే లభించలేదు. ఆ వీడియోలో చూసిన ప్రకారం. ఓ వ్యక్తి ఆటోమేటిక్ కారులో ఏదో సమస్య తలెత్తింది. అది సరిచూసుకునేందుకు కారును పక్కన పార్క్ చేశాడు. హుడ్ ఓపెన్ చేసి మళ్లీ కారులో కూర్చున్నాడు. లోపల ఏదో అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్లీ వచ్చి ఇంజిన్ దగ్గర ఏదో చెక్ చేశాడు. రెంచ్ తో సెల్ఫ్ మోటార్‌ని కదిలించడంతో అది ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. కారు ఎదురుగా ఉన్న అతనిపైకి దూసుకెళ్లింది. తన వెనకాలే ఉన్న షాట్ షట్టర్‌కి కారుకి మధ్యలో అతను నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసిన వాళ్లంతా షాకవుతున్నారు.
ఇక్కడ అతను చేసిన ప్రధాన పొరపాటు ఏంటంటే.. కారును పార్క్ చేసిన తర్వాత అతను హ్యాడ్ బ్రేక్ వేయలేదు. అంతేకాకుండా ఆటోమేటిక్ కారుకు డ్రైవ్, రివర్స్, పార్క్ అని ఉంటాయి. అతను లివర్ డ్రైవ్‌లో పెట్టి అలాగే వదిలేసినట్లు ఉన్నాడు. కారు స్టార్ట్ కావడంతో ముందుకు దూసుకెళ్లింది. అతను కారు- షటర్ మధ్య నలిగి ఘోరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్‌ని దీపక్ ప్రభు అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మీ బంధువులు, మిత్రులకు ఫార్వార్డ్ చేసి వారిని హెచ్చరించండి.. ఆటోమేటిక్ కారుకు ఎప్పుడు అలా ఎదురుగా ఉండి రిపేర్ చేయకండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WARNING
If an automatic vehicle breaks down, never stand in front of the vehicle.
Please warn your friends and relatives.
Share this message as an example. pic.twitter.com/P2OPQDXgvg— Deepak Prabhu (@ragiing_bull) September 12, 2022