Viral Video: ఈ మధ్య కాలంలో ట్రైన్‌లో చోరీలు బాగా పెరిగిపోయాయి. కొద్దిగా ఏమరపాటుగా ఉంటే చాలు.. మన ఒంటి మీద ఉన్న వాటిని కూడా కొట్టేసే ఖతర్నాక్ దొంగలు ఉన్నారు. అంతేకాదు! ట్రైన్ బయటి నుంచి లోపల ఉన్న వ్యక్తుల చేతులలో ఉన్న ఫోన్లను లాగేసుకునే దొంగలు కూడా ఉన్నారు. అలా చాలా మంది ప్రయాణికులు తమ ఫోన్లు పోగొట్టుకున్నారు. తాజాగా, ట్రైన్‌లోని ఓ వ్యక్తి ఫోన్ లాగేసుకుందామని చూసి, ఇబ్బందుల పాలయ్యాడు ఓ దొంగ. వివరాల్లోకి వెళితే.. బిహార్, సోనేపూర్ రైల్వే స్టేషన్ వద్ద ఓ దొంగ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చేతిలోని ఫోన్ లాక్కుందామని చూశాడు.
చేతిని కిటికీలోంచి లోపలికి పెట్టి ఫోన్ లాగే ప్రయత్నం చేశాడు. అయితే, ఇది గమనించిన ప్రయాణికుడు వెంటనే దొంగ చెయ్యి పట్టుకున్నాడు. తర్వాత మరికొంత మంది ఆ దొంగ రెండు చేతులు పట్టుకున్నారు. దీంతో దొంగ వేగంగా వెళుతున్న ట్రైన్‌లో చేతులు పెట్టి ఇరుక్కుపోయాడు. ట్రైన్ బయట వేలాడుతూ ప్రయాణించాడు. విడిచిపెట్టమని ఎంతో బతిమాలాడు. కానీ, ప్రయాణికులు మాత్రం అతడ్ని వదల్లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mobile Phone Thief caught in a Moving Train in Bihar; begged for Life. Saved. #TNI #Insight pic.twitter.com/FQfG4WXXrx
— The News Insight (TNI) (@TNITweet) September 15, 2022
తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karimnagar: నెల వ్యవధిలో 3 మరణాలు.. ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు.. ఏం జరుగుతోంది?..