ప్రేమలో పడడమే ఈజీనే.. కానీ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా పాట్లు పడాలి. మొదట మొదలయ్యేది.. ప్రేమను వ్యక్త పరచాలా? వద్దా? అన్న ప్రశ్న. అవతలి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న భయంతో గుండెలోని ప్రేమను బయటకు చెప్పకుండా దాచేస్తూ వుంటారు. పోనీ, ధైర్యం చేశామా? ఎలా ప్రపోజ్ చేయాలన్నది రెండో ప్రశ్న. కవిత రాసి ప్రపోజ్ చేయడం, గులాబీతో ప్రపోజ్ చేయడం, ప్రేమలేఖతో ప్రపోజ్ చేయడం.. ఇవన్నీ పాత కాలపు ధోరణులు. ఇప్పుడంతా సినిమా స్టయిల్. ఏ పిల్లా.. ‘ఐ లవ్ యూ’ ఈ టైప్. వీటిని చూసి చాలా మంది నిజజీవితంలో కూడా ఇలానే ఫాలో అవుతూ ఉంటారు. మన కథలో కూడా ఒక వ్యక్తి సినిమాటిక్ స్టయిల్లో ప్రపోజ్ చేశాడు. అతడు ప్రపోజ్ చేసిన విధానం.. ఆ యువతి ఇచ్చిన ఎక్సప్రెషన్స్ నెటిజన్స్ మదిని దోచేస్తున్నాయి.
కాలంతో పాటు ట్రెండ్ మారింది. నాలుగు మంచి పనులు చేస్తే బుట్టలో వేసుకోవచ్చన్నది.. పాత స్టయిల్. ప్రపోజ్ చేసే స్టైల్‌ని బట్టి వలలో వేసుకోవచ్చన్నది కొత్త స్టయిల్. ఈ ఆలోచనతో ఓ భారతీయ వ్యక్తి.. తను ప్రేమించిన యువతితో కలిసి పారిస్ వెళ్లి, అక్కడ ఈఫిల్ టవర్ సాక్షిగా తనకు ప్రపోజ్ చేశాడు. “మ్యారీ మీ” అని పూలతో నేల మీద అందంగా రాసి.. బాలీవుడ్ రేంజ్‌లో ప్రపోజ్ చేశాడు. గులాబీ రేకులు.. కొవ్వొత్తులు ఇలా ఎంతో రొమాంటిక్‌గా సెటప్ చేయడం జరిగింది. ఆ సమయంలో ‘షారుక్ ఖాన్ పాట కోయీ మిల్ గయాకి డాన్స్ వేస్తూ.. యువతిని ఉత్సాహపరిచాడు. ఆమె కూడా నాలుగు స్టెప్పులు వేసింది. ఆ తర్వాత డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. అంతే.. ఆమె అతని ప్రేమకి ఓకే చెప్పేసింది. ఆ తర్వాత ముద్దులతో ఈ జంట సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ షికార్లు కొడుతోంది.