ప్రజాప్రతినిధులు.. ప్రజల చేత, ప్రజల కోరకు ఎన్నుకోబడిన వ్యక్తులు. అందుకే ప్రజలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలానే వారి నియోజకవర్గాల్లో జరిగే వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అలాంటి సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అలా ఎదో చేయలనుకుని ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్ని.. గుర్తుగా ఓ చిన్న పటాస్ పేల్చారు. అయితే తనపైకి వస్తుందేమో అని పటాసును ముట్టించి పరుగు తీశాడు. ఈ క్రమంలో పట్టుతప్పి కిందపడి పోయాడు. ఈ ఘటన బీహార్ లోని సోనే పూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని సోనే పూర్ లో రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంటును నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. వినయ్ సింగ్.. సోనే పూర్ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ఇక పుట్ బాల్ టోర్మమెంట్ ప్రారంభోత్సవ వేడుకలకు హజరైన వినయ్ సింగ్ … క్రీడారులందనిరి పలకరించారు. ఇక టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి సంకేతంగా ఓ పటాకీ కాల్చమని అక్కడి వారు కోరారు. దీంతో వారి మాట కాదనలేక సదరు ఎమ్మెల్యే అగ్గిపుల్లతో ఆ పటాస్ ను పేల్చారు. అయితే అది ఎక్కడ తన మీద పడుతుందో అనే భయంతో అగ్గి ముట్టించిన వెంటనే పక్కకు పరుగు లంకించాడు.
అయితే ఈ క్రమంలో పట్టుతప్పి ముందుకు పడిపోయారు. దీంతో ఆయన ముఖంపై స్వల్ప గాయాలు అయ్యాయి. ఇది ఇలా ఉంటే.. పటాస్ కూడా ఎమ్మెల్యో తో కామెడీ చేసింది. సారు.. పరుగెత్తితే తనకెంటి తొందర అన్నట్లు.. ఆయన కిందపడి లేచిన తర్వాత టపీ మంటూ శబ్ధం చేస్తూ ఆ బాంబు పేలింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు.. పాపం ఎమ్మెల్యే సార్ అంటే.. మరికొందరు తెగ నవ్వుకున్నారు. సార్ మీకెందుకు ఈ సాహసాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
खेल प्रतियोगिता का उद्घाटन करने पहुँचे पूर्व विधायक मुँह के बल गिर पड़े | Unseen India pic.twitter.com/brzK5t7iD5
— UnSeen India (@USIndia_) October 18, 2022