Viral Video: మానవుని జీవితం నీటి మీద బుడగలాంటిది. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. టెక్నాలజీ, కల్తీలు పెరిగిపోయిన తర్వాత అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలే ప్రాణాలు తీస్తున్నాయి. కొద్ది పాటి శారీరక శ్రమతో గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి కోలాటం డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, దాహోద్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం కోలాటం డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. రెండు చేతుల్లో కోలాటం కర్రలతో వేగంగా అటు ఇటు తిరుగుతూ.. జోడీగా ఉన్న వ్యక్తితో కోలాటం ఆడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆయాసం వచ్చినట్లు కిందికి వంగాడు.
జోడీగా ఉన్న వ్యక్తి అతడి ఆయాసాన్ని గుర్తించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తిని పిలిచి కోలాటం ఆడమన్నాడు. ఆ వ్యక్తి సొమ్మసిల్లి పోతున్న వ్యక్తి చేతిలోంచి కోలాటం కర్రల్ని తీసుకున్నాడు. సొమ్మసిల్లిపోతున్న వ్కక్తి కొద్దిగా శక్తిని కూడగట్టుకుని పైకి లేచాడు. రెండు అడుగులు వేశాడో లేదో.. వెంటనే కుప్పకూలాడు. అక్కడి వారందరూ అతడ్ని పక్కకు తీసుకువచ్చారు. ఎంతకీ పైకి లేవకపోవటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే అతడు కన్నుమూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Man dies while dancing in #Gujarat‘s Dahod https://t.co/cEvnDqZgUE pic.twitter.com/91WTPN7L9Z
— The Times Of India (@timesofindia) October 18, 2022