Youtube: మనలో క్రియేటివిటీ ఉంటే డబ్బుల సంపాదనకు కొదవ ఉండదు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్‌లో అయితే సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత. కొంతమంది యూట్యూబర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఇప్పుడు చెప్పే వ్యక్తి హాలీవుడ్ స్టార్ హీరోలకు మించి డబ్బు సంపాదిస్తున్నాడు. అతడి సంవత్సర ఆదాయం ఏకంగా 320 కోట్ల రూపాయలు. మార్క్ ఫిచ్‌బాచ్ అనే వ్యక్తికి యూట్యూబ్‌లో మార్క్ ఇప్లియర్ అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్‌ను అతడు 2012లో మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆ ఛానల్‌కు 33.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దీంతో అతడు పెట్టిన ప్రతీ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు భారీగా సంపాదిస్తున్నాడు.
సంవత్సరానికి దాదాపు 320 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని సమాచారం. ఇక, దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ నేను ఇంత డబ్బు సంపాదించటం.. సమాజాన్ని మోసం చేయటం లాగా అనిపిస్తోంది. అంత డబ్బు సంపాదిస్తున్నానా అంటే అది నిజం కాదు.. అలాగని అది అబద్ధం కూడా కాదు. కంటెంట్ చేయటం అన్నది నా కల. అంతేకాదు.. ఇతరుల్ని కంటెంట్ చేసేలా ప్రోత్సహించటమే నా ఉద్ధేశ్యం’’ అని పేర్కొన్నాడు. ఇక, యూట్యూబ్‌లో ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్న వారిలో ఒకరైన మిస్టర్ బీస్ట్ కన్ను మార్క్ ఇప్లియర్ ఛానల్‌పై పడింది. దాన్ని కొనటానికి అతడు పావులు కదిపాడు. దాదాపు 1 బిలియన్ డాలర్స్ ఆఫర్ చేశాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే వెయ్యి కోట్ల రూపాయల పైమాటే.