‘వరుడు కోసం వధువు కావలెను/ వధువు కోసం వరుడు కావలెను..’ ఇలాంటి ప్రకటనలను నిత్యం చూసేవే. కాకుంటే వారి వారి తెలివితేటలు, ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా దినపత్రికల్లోనూ, మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలోనూ ప్రకటనలు ఇస్తుంటారు. వీటిల్లో తనకున్న అర్హతలేంటి? కాబోయే వాడికి ఉండాల్సిన అర్హతలేంటి? అన్న వివరాలును సవివరంగా తెలియజేస్తారు. మన కథలో ఉన్న వధువు కూడా అలానే కాబోయే వాడికి ఉండాల్సిన అర్హతల గురుంచి పూస గుచ్చినట్లు వివరించింది. వయసు, జీతం ఎంతుండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమేలా తయారు చేసి పెట్టింది. కాకుంటే.. ఈ ప్రకటన చూసిన వారందరూ కళ్లు తేలేస్తున్నారు.
ఈ ప్రకటన ఇచ్చిన వధువు చదువులో చిచ్చర పిడుగై ఉండాలి. లేదంటే ఇలాంటి తెలివితేటలు చదవబ్బని వారికి తట్టవ్. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏమి చదివి ఉండాలి? ఎలాంటి కాలేజీల్లో చచదువుండాలి? జీతం ఎంత ఉండాలి? ఫ్యామిలీ బ్యాంక్ గ్రౌండ్ ఎలా ఉండాలి?.. ఇలా అన్ని విషయాలను ప్రొఫైల్లో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఈ ప్రకటన చూసిన ఓ యువకుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే ఆమె ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేయగా.. అది తెగ వైరల్ అయ్యింది. ఆ డిమాండ్లు ఏంటో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెట్టాల్సిందే..
“కాబోయే వాడు 1992 జున్ తర్వాతే జన్మించి ఉండాలి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ ఇలా ఏం చదివినా పర్వాలేదు. కానీ దేశంలోని అగ్ర విద్యాసంస్థల్లోనే చదువు పూర్తి చేసి ఉండాలి. అంటే.. ఐఐటీ, ఐఐఎం, బిట్స్ పిలానీ, ఐఎస్ఈ, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, బాంబే, ఢిల్లీ, రూర్కీ, ఖరగ్పూర్ ఇలా దేశంలోని ముఖ్య నగరాల్లో ఉన్న యూనివర్సిటీల నుంచి డిగ్రీ పొంది ఉండాలి. ఈ కాలేజీల జాబితాను కూడా ఆ అమ్మాయి క్షుణ్నంగా తన ఫ్రొపైల్ లో పొందుపరిచింది. అంతేనా! కాదు.. ఇంకా ఉంది. జీతం ఏడాదికి కనీసం రూ.30 లక్షలు ఉండాలట. తక్కువైతే నో. అందులోనూ వరుడికి తోబుట్టువులు ఇద్దరికంటే ఎక్కువ ఉండొద్దట. ముఖ్యంగా వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట” ఇవండీ.. ఈ వధువు గారి డిమాండ్లు. ఈ యువతి డిమాండ్లను చూసి నెటిజన్లు ఈమెకు పెళ్లవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వధువు పెళ్లి ప్రకటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
What is your take on this? pic.twitter.com/FWO1YGyxge
— Dr.D G Chaiwala (@RetardedHurt) October 17, 2022