లాటరీ.. దీనిని వ్యసనం అనాలో, కోట్లు తెచ్చిపెట్టే అక్షయపాత్ర అనాలో ఎవరికీ అర్థం కాదు. కానీ, చివరికి మాత్రం అదృష్టం పేరుతో మనిషి జేబుకు చిల్లిపెట్టే ఒక క్రీడలాగానే కనిపిస్తుంటుంది. ఈ ఆటలో ఎంతో మంది కోట్లు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. రోడ్డున పడిన కుటుంబాల సంఖ్యకు అయితే లెక్కే లేదు. ఈ లాటరీ అనేది కొందరికి సరదా అయితే మరికొందరికి వ్యసనం. తింటానికి తిండి లేకపోయినా లాటరీ టికెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఇది కేవలం మన దేశంలోనే ఉందేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలాంటి సరదా ఉన్నవాళ్లు.. ఇట్టే కోటీశ్వరులు అయిపోవాలని కలలు కంటున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇటీవలే కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచున్న విషయం తెలిసిందే. అయితే డబ్బులు గెలవని 66 లక్షల మంది గురించి ఎవరికీ తెలియదు.
ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం అదృష్టం పడిశం పట్టినట్లు పట్టుకున్న ఓ వృద్ధుడి(67) కథ. తాతకు ఫేమస్ కావడం ఇష్టంలేక లాటరీ అధికారులను పేరు చెప్పకండని కోరాడంట. ఆయన జీవితంలో జరిగిన ఒక సర్జరీ అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఓ రోజు మధ్యాహ్నం వెళ్లి ఒక డ్రాకి సంబంధించి టికెట్ కొనుకున్నాడు. తర్వాత అతను సర్జరీకి వెళ్లాల్సి ఉంది. అయితే ముందు కొన్న సంగత మర్చిపోయాడో..? లేక ఎలాగైనా ఆ డ్రాలో టికెట్ తన దగ్గర ఉండాలి అని కోరుకున్నాడో సాయంత్రం వెళ్లి మరో టికెట్ కొనుక్కొచ్చాడు. అయితే తన భర్త రెండు టికెట్లు కొన్నాడనే విషయం తెలియని భార్య.. భర్తకు ఆ డ్రాలో టికెట్ తప్పకుండా ఉండాలని ఆమె కూడా కోరుకుంది. అందుకే వెంటనే భర్తకు చెప్పకుండా వెళ్లి అతని కోసం ఒక టికెట్ కొనుక్కొచ్చింది.
తాతకు సర్జరీ పూర్తయ్యే సరికి శుభవార్త కూడా వినేశాడు. వాళ్లు పొరపాటున్న కొన్న టికెట్లతో కలిపి మొత్తం మూడింటింకి ప్రైజ్ మనీ వచ్చింది. నిజానికి లాటరీలో ఒక టికెట్‌కి డబ్బు రావడమే ఎక్కువని భావించే వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ, ఈ వృద్ధ దంపతులకు మాత్రం అదృష్టం పడిశం పట్టినట్లు పట్టి కొన్న 3 టికెట్లకు ప్రైజ్ మనీ వచ్చింది. మూడు టికెట్లకు కలిపి వారికి 1,50,000 వేల డాలర్లు అందాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1.22 కోట్లు అనమాట. ఆ విషయం గురించి మాట్లాడుతూ తాత సంతోషం వ్యక్తం చేశాడు. నేను పొరపాటున కొన్న మూడు టికెట్లకు ప్రైజ్ మనీ రావడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయడన్నాడు. నిజానికి ఆ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు.