అన్ని జన్మల్లో కల్ల మానవ జన్మ చాలా ప్రాముఖ్యత కలిగినది. అందుకే ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ఇక కష్ట సుఖాలు అంటారా?.. రేయింబవళ్లు లాంటివి. కొందరు ప్రతి చిన్న విషయానికి జీవితంపై విరక్తి చెందుతారు. మరికొందరు చదువుల,ప్రేమ, కుటుంబం ఇలా ప్రతి విషయంలో ఫైల్ అయ్యామని ఆత్మహత్యకు చేసుకుంటుంటారు. తాజాగా ఓ యువకుడు ఉద్యోగం పోయిందనే వేదనతో హైటెన్షన్ కరెంట్ తీగలపై పడుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ప్రదేశ్ లోని అమారియా అనే టౌన్ లో నౌషాద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు హైటెన్షన్ కరెంట్ తీగలపై ఏకంగా పడుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా వాటిపై తర్వాత వేలాడుతూ.. వాటిని పై అటు ఇటు దొర్లాడు. ప్రమాదభరితమైన స్టంట్లు చేస్తూ అందరిని టెన్షన్ పెట్టాడు. అతడి అదృష్టం ఏమిటంటే ఆ సమయంలో కరెంట్ సరఫరా లేదు. కింద నుంచి చూస్తున్న జనం కిందకి రావాలని నౌషాద్ ను కోరారు. చాలా సయమంలో పాటు అతడి చేష్టాలకు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అనంతరం విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి..విషయాన్ని తెలియజేశారు. నౌషాద్ కుటుంబ సభ్యులు వచ్చి ఎంత బతిమాలినా.. అతడు విద్యుత్ తీగలపై పడుకుని కోతి విన్యాసాలు చేస్తూ అందరిని కొంత సమయం టెన్షన్ పెట్టాడు.
ఎవరూ ఎంత బతిమాలినా.. ఆ వ్యక్తి విద్యుత్ తీగలను వదిలి కిందకు దిగలేదు. ఇక లాభం లేకపోవడంతో.. చివరకు కొందరు వ్యక్తులు పక్కన ఉన్న భవనం పైకి ఎక్కి.. అతడిని కిందకు దించేందుకు ప్రయత్నం చేశారు. చిట్టచివరికి అందరు కలసి నౌషాద్ పట్టుకుని విద్యుత్ వైర్లను వీడి కిందకి దిగాడు. దీంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం జాబ్ పోయిందని, అప్పుడు బాగా డిప్రెషన్ కి గురయ్యాడని స్థానికులు తెలిపారు. ఇక అప్పటి నుంచి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Pilibhit black Amriya me man 11000 volt light ke tar pe for losing his job pic.twitter.com/Rwtq6N1mmI
— Irshad Khan (@IrshadK54670394) September 26, 2022