డెలివరీ బాయ్ లని కొంతమంది చిన్న చూపు చూస్తుంటారు. డోర్ డెలివరీ అన్నాం కదా, డోర్ వరకూ రావడానికి రోగమే అని కసురుకుంటారు. లిఫ్ట్ లేని ఇళ్లలో, రెండు, మూడు ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు కూడా కిందకి దిగకుండా పైకి రావాల్సిందే అని పట్టుబడతారు. టిప్ ఇస్తే ఓకే.. కానీ ఇవ్వనోళ్లు ఉంటారు. పాపం వాళ్లు మాత్రం ఎన్ని ఇళ్ళకని అలా తిరుగుతారు చెప్పండి. వాళ్లకి టైం అనేది ఎంతో విలువైంది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆర్డర్స్ తీసుకుంటూ డెలివరీ చేస్తుంటారు. కుటుంబ బాధ్యతలు, కష్టాలు వాళ్ళని అనుక్షణం పరుగులు పెట్టిస్తుంటాయి. ఎంతలా అంటే ఏదైనా ప్రమాదం జరిగితే తమకి ఏమైందో అన్న ఆలోచన లేకుండా అక్కడ ఫుడ్ కోసం కస్టమర్ వెయిటింగ్ అని డోర్ డెలివరీ చేసేంతగా డెడికేషన్ ఉంటుంది.
తాజాగా ఓ యువకుడు తనకి తనకి యాక్సిడెంట్ అయ్యిందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఫుడ్ డెలివరీ చేశాడు. అది కూడా టైంకి. ఎందుకంటే టైం అంటే మనీ కదా. సదరు యువకుడు స్విగ్గీ కంపెనీలో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. అయితే అతను ఆర్డర్ తీసుకుని కస్టమర్ కి డెలివరీ చేసేందుకు వస్తుండగా దారిలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అతని కాలికి దెబ్బ తగిలింది. రక్తం రాలేదు గానీ పాదం వాచింది. మొత్తానికి యువకుడు.. కస్టమర్ ఉంటున్న అడ్రస్ కి చేరుకొని.. లిఫ్ట్ లో పై ఫ్లోర్ దాకా వెళ్ళాడు. తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి యువకుడ్ని చూశాడు. నీ చెప్పులేవి అని అడిగాడు. దానికి ఆ యువకుడు, “దారిలో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. పాదాలు, మడమ నొప్పి వస్తుందని చెప్పులు వేసుకోకుండా వచ్చేసాను” అని సమాధానమిచ్చాడు.
దానికి తారిఖ్ ఖాన్.. “మరి యాక్సిడెంట్ అయితే పని మానేసి రెస్ట్ తీసుకోవచ్చుగా” అని అన్నాడు. దానికి ఆ యువకుడు.. “నవ్వి.. నా కుటుంబాన్ని నేనే పోషించాలి సార్” అని లిఫ్ట్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు. దీనికి చలించిపోయిన తారిఖ్ ఖాన్.. యువకుడి గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకొచ్చాడు. “ఇలాంటి యువకులే తనను మరింత కష్టపడేలా చేస్తారని, తనను తాను ముందుకు వెళ్ళడానికి అతనే స్ఫూర్తి, స్విగ్గీ కంపెనీ.. ఈ యువకుడి కష్టాన్ని గుర్తించి తగిన ప్రతిఫలం ఇవ్వాలి” అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు “ఎవరైనా అతనికి సహాయం చేయాలనుకుంటే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి. అతని పేటీఎం నంబర్ ఇస్తాను. అతనికి డబ్బులు అవసరం అని చెప్పాడు. తన నంబర్ ఎవరికైనా ఇవ్వచ్చునని చెప్పాడు. మీరిచ్చే డబ్బుతో అతను షూస్ కొనుక్కుంటాడు. అతని కుటుంబ అవసరాలు తీర్చుకుంటాడు” అని ప్రత్యేకంగా ఒక నోట్ రాసుకొచ్చారు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.
Swiggy Delivery Boy Works Barefoot After Accident; Netizens https://t.co/WOxxSeolIc#InspirationalStory #LinkedIn #SwiggyDeliveryBoy
— Curly Tales (@CurlyTalesIndia) September 30, 2022