SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Mother Got Rid Of Her Son Is It A Curse To Be Born To A First Husband

8 ఏళ్ళ కొడుకుని రైలు ఎక్కించి వదిలించుకుంది! మొదటి భర్తకి పుట్టడమే శాపమా?

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 16 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
8 ఏళ్ళ కొడుకుని రైలు ఎక్కించి వదిలించుకుంది! మొదటి భర్తకి పుట్టడమే శాపమా?

అమ్మ.. ప్రపంచంలో ఇంతకు మించిన బలమైన మాట లేదు. ప్రాణాలు పోయే అంత నరకం అనుభవించి.. బిడ్డకి ప్రాణాలు పోస్తుంది అమ్మ. అందుకేనేమో ఆ పేగు బంధం ముందు.. ఏదీ సరితూగదు. పుట్టకముందు మాత్రమే కాదు, పుట్టాక కూడా కడుపులో పెట్టుకుని సాకడం ఒక్క అమ్మకే సాధ్యం. కానీ ఇక్కడ ఒక తల్లి తన 8 ఏళ్ల బాబుని వదిలించుకోవాలని చూసింది. దూరంగా పోయి బతకరా అంటూ దగ్గరుండి మరీ రైలు ఎక్కించింది. అమ్మ అనే పదానికే మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటన తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.  రామాంతపూర్ కి చెందిన జోగు అంబికకు, జోగు కన్నప్ప అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరి వివాహ బంధానికి ప్రతిరూపంగా మణికంఠ అనే బాబు పుట్టాడు. అయితే మణికంఠ తన తండ్రిని కోల్పోయాడు. దీంతో అంబిక.. శ్రీను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప పుట్టింది. అయితే తండ్రి లేని లోటుని తీర్చాల్సిన శ్రీను.. సవతి తండ్రి బుద్ధి చూపించాడు.

తమకి పుట్టిన పాప చాలు, వీడు మనకి అవసరమా అని బాబుని వదిలించుకునేందుకు తెగించాడు. అల్లరి చేస్తున్నాడన్న సాకుతో బాలుడి తల్లి అంబిక, సవతి తండ్రి శ్రీను ఇద్దరూ కలిసి బాబుని సికింద్రాబాద్ స్టేషన్ కి తీసుకెళ్లి.. భద్రాచలం వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఎక్కించారు. “పోయి ఎక్కడైనా బతుకు.. పెరిగి పెద్దయ్యాక తిరిగి రా” అంటూ చెప్పి మరీ రైలు ఎక్కించారు. ఇంతకంటే ఘోరం ఇంకెక్కడా ఉండదు. చిన్న పిల్లలన్నాక అల్లరి చేయడం మామూలే. ఆ వయసులో అల్లరి చేయకపోతే ఆడికి ఏదో రోగం ఉన్నట్టు. పిల్లల అల్లరిని కూడా భరించలేని పెంపకం ఏం పెంపకం? చదువుకునే వయసు, ఆడుకునే వయసులో కన్నవారికి దూరంగా బతకడం సాధ్యమా? పైగా పెద్దయ్యాక తిరిగి రావాలని చెప్పడం ఒకటి. ఏమై తిరిగి రావాలి? కలెక్టరై రావాలా? పోలీసై రావాలా? ఇదేమైనా సినిమానా? రెండున్నర గంటల్లో అనుకున్నది అయిపోవడానికి.

mother loves

అరె ఎనిమిదేళ్ల వయసులో ఏ బాలుడైనా తల్లి, తండ్రి వెంట లేకుండా ప్రయాణం చేయగలడా? అది కూడా బంధువుల తోడు లేకుండా. రైలులో ఒంటరిగా ప్రయాణించే వయసా అది. పాపం ఆ బాబు ఎంత బాధపడి ఉంటాడు. బాబుని చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుందే. అలాంటి బాబుని వదిలించుకోవాలని ఎలా అనిపించిందో ఆ మహా తల్లికి. అమ్మ చెప్పింది కాబట్టి ఏం మాట్లాడకుండా రైలు ఎక్కేసాడు. కనీసం ఏడవను కూడా ఏడవలేదంటే అమ్మ మాటకు ఎంత విలువ ఇచ్చాడో కుర్రాడు. ఆ వయసులో అంత మెచ్యూరిటీ ఉందంటేనే అర్ధం చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ ముందు అల్లరి అన్న పదం కూడా చిన్నదే అని. కోపంలో ఏ తల్లైనా, తండ్రైనా పిల్లల్ని కొట్టడం, వదిలేస్తా అని బెదిరించడం లాంటివి చేస్తారు. అంత మాత్రాన నిజంగా వదిలేస్తారా? పోనీ రైల్వేస్టేషన్ దాకా వెళ్లినా ఆ మాతృ హృదయం ద్రవించలేదు. బాబు తిరిగొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో అయినా మనసు కరగాలిగా. అయినా కరగలేదు మహా తల్లి మనసు. మొదటి భర్తకు పుట్టడమే ఆ బాబు చేసిన శాపం అయ్యింది.

అదే తండ్రి ఉంటే అమ్మ ఇలా చేస్తుంటే సూపర్ మ్యాన్ లా అడ్డుకునేవాడు కదా అని ఆ బాబు ఆలోచిస్తూ ఉంటాడు. సవతి తండ్రి కాబట్టి, తన కొడుకు కాదు కాబట్టి పోతే పోనీ అని అడ్డు చెప్పలేదు. ఇది కదా అమానవీయం అంటే. ఇది కదా పాపమంటే. పాపం బాబు ఒక్కడే రైలులో బిక్కుబిక్కుమంటూ తిరుగుతుంటే చూసి చలించిన ప్రయాణికులు ఘన్ పూర్ పోలీసులకు అప్పగించారు. వారు బాబు చెప్పిన ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ ఆధారంగా తల్లి, సవతి తండ్రిని పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చి బాబుని తీసుకెళ్లమని అన్నారు. అయినప్పటికీ ఆ తల్లి హృదయం కరగలేదు. మనసులో కల్మషం, కర్కశం అనే కరగనటువంటి ఘన పదార్థాలను పెట్టుకుంటే ఏ కర్కశ తల్లి హృదయం మాత్రం కరుగుద్ది? అమ్మా తీసుకెళ్ళు అని అన్నా కూడా ఆ బాబుని తీసుకెళ్ళలేదంటే.. ఆ తల్లి ఎంతలా కళ్ళు మూసుకుపోయి ఉన్నదో అర్ధమవుతోంది. మాకొద్దు ఈ బాబు అని ఖరాకండిగా చెప్పేయడంతో.. పోలీసులు బాబుని చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించి అనాథాశ్రమంలో చేర్పించారు. బాలుడికి మంచి చదువు అందేలా చూస్తామని అన్నారు.

mother loves

పిల్లల్ని కన్నది ఎందుకు? నచ్చలేదని, అల్లరి చేస్తున్నాడని వదిలేయడానికా? ఇలా వదిలేయడం వల్లే కదా.. పిల్లలు దారి తప్పి పెద్దయ్యాక దొంగలుగా, నేరస్తులుగా తయారవుతున్నారు. ఇలాంటి తల్లిదండ్రుల వల్లే కదా సమాజంలో నేరాలు ఎక్కువయ్యేది. ముందు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని. కానీ అంత దూరం ఆలోచించే అవకాశం మనకి ఆ బాబు ఇవ్వలేదు. “ఏరా నాన్న.. పెద్దయ్యాక ఏమవుతావ్? అని బాబుని పోలీసాయన అడిగితే.. తడబడకుండా పోలీస్ అవుతా” అని చెప్పాడు. బాబు మెచ్యూరిటీ లెవల్స్ కి మాత్రం కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి. అమ్మని వదిలేసిన కొడుకుల్ని చూశాము గానీ అమ్మే కొడుకును వద్దు అని వదిలేయడం ఇదే మొదటిసారి ఏమో, చరిత్రలో ఇదే తొలిసారి ఏమో. ఈ హృదయవిదారకర ఘటన చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. బాబుని చూస్తుంటే మాకే జాలి వేస్తుంది, మాకే పెంచుకోవాలనిపిస్తుంది. అలాంటిది నీకేం మాయరోగమమ్మ అని నెటిజన్లు ఆమెను తిడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి తన బిడ్డను వదిలేసిన ఈ కన్న తల్లిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

  • ఇది కూడా చదవండి: కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బదులు మోదీ ఫోటో పెడతారేమో.. KTR సెటైర్లు!
  • ఇది కూడా చదవండి: అందమైన కుటుంబంలో అంతులేని విషాదం!

Tags :

  • hyderabad news
  • Janagama District
  • mother
  • Ramanthapur
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam