తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేసీఆర్‌కు మనవడు అంటే ప్రాణం. ఈ విషయం అనేకసార్లు బహిర్గతమైంది. ఇక పలు సందర్భాల్లో హిమాన్షు రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అయిన సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ కూడా గురయ్యాడు. అయితే అలాంటి కామెంట్స్‌కి ధీటుగా బదులిస్తాడు హిమాన్షు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. కొన్ని రోజుల క్రితం హిమాన్షు ఒక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. ఇక సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు షేర్ చేస్తుంటాడు హిమాన్షు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్లో అతడు పోస్ట్ చేసిన ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇతడు హిమాన్షేనా.. మరీ ఇలా మారిపోయాడేంటి.. అసలు గుర్తు పట్టలేకుండా ఉన్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా హిమాన్షు అలాన్ వాకర్ని కలిసిన సందర్భంగా అతడితో దిగిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. వీటిల్లో హిమాన్షు చాలా సన్నగా ఉన్నాడు. సగానికి సగం బరువు తగ్గాడు. కర్లీ హెయిర్‌తో.. స్లిమ్‌గా మారిన హిమాన్షును వెంటనే చూడగానే పోల్చుకోవడం కష్టంగానే ఉంది. ఆల్ట్రామోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. వరల్డ్ ఫేమస్ డీజేలలో ఒకరైన అలాన్ వాకర్ హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో షో నిర్వహించేందుకు వచ్చిన సమయంలో అతడిని కలిశాడు హిమాన్షు. ఈసందర్భంగా అలాన్ వాకర్‌తో దిగిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రసుత్తం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It was a pleasure to meet @IAmAlanWalker at his concert in Hyderabad. pic.twitter.com/0h84KWeMk7
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) September 25, 2022