ట్యాంక్‌బండ్ శివ.. ఈ పేరు గురించి హైదరాబాద్ వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు. ఎందరో జీవితాలను కాపాడాడు. అతడి సాయం పొందిన వారు నగరంలో ఎంతో మంది ఉన్నారు. క్షణికావేశంలో జీవితాలను అంతం చేసుకునేందుకు ప్రయత్నించే వారిని కాపాడటమే వృత్తిగా పెట్టుకున్నాడు శివ. ట్యాంక్‌బండ్ పక్కనే నివసించేవాడు శివ. హుస్సెన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసే వారిని కాపాడటమే తన పనిగా పెట్టుకున్నాడు. ఇలా ఎందరికో ప్రాణదాతగా నిలిచాడు. శివ గురించి.. అతడు చేస్తున్న మంచి పని గురించి తెలుసుకున్న కేటీఆర్.. అతడిపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అతడి ఆర్థిక పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నాడు కేటీఆర్. ట్యాంక్‌బండ్ పక్కన చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నట్లు తెలియడంతో.. అతనికి నెక్లెస్ రోడ్‌లో ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాడు కేటీఆర్.
కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నాడు శివ. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానెల్ ట్యాంక్‌బండ్ శివని తాజాగా ఇంటర్వ్యూ చేసింది. శివ కొత్త ఇల్లు ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో శివ తన మనసులో కోరిక బయటపెట్టాడు. ట్యాంక్‌బండ్‌పై గుడిసెలో ఉండే తన పరిస్థితి తెలుసుకుని మంత్రి కేటీఆర్ ఎంతో మేలు చేశారని.. తనకు డబుల్‌బెడ్రూం ఇల్లు ఇచ్చారని తెలిపాడు. కేటీఆర్ చేసిన మేలును జీవితాంతం మర్చిపోలేమని.. తాను, తన కుటుంబం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పుకొచ్చాడు. అంతేకాక తనకు ఇంత మేలు చేసిన కేటీఆర్.. ఒక్కసారి తన ఇంటికి వస్తే తాము ఎంతో సంతోషిస్తామని తెలిపాడు.
ఈ ఇంటర్వ్యూను చూసిన కొణతం దిలీప్.. దాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. శివకు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను ట్యాంక్‌బండ్ శివ ఇంటికి వెళ్తానని ట్వీట్ చేశారు. తమ కోరిక మన్నించి కేటీఆర్ స్వయంగా తన ఇంటికి వస్తానని చెప్పడంతో శివ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ ట్వీట్ చూసిన నెటిజనులు కూడా కేటీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Will visit Shiva’s home soon 😊 https://t.co/hd6gK3rwhc
— KTR (@KTRTRS) September 15, 2022